విడుదల అయిన అతి తక్కువ రోజుల్లోనే "ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన "హంట్" మూవీ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి ప్రేక్షకాదరణ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో ఎస్ ఎం ఎస్ మూవీ తో మంచి విజయాన్ని అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు.

ఆ తర్వాత అనేక మూవీ లలో నటించిన సుధీర్ ఇప్పటికే ఎన్నో విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా సుధీర్ , మహేశ్ సూరపనేని దర్శకత్వంలో రూపొందిన హంట్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ జనవరి 26 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకో లేక పోయింది.
 

దానితో ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లు దక్కలేదు. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలమైన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను దక్కించుకున్న ఆహా "ఓ టి టి" సంస్థ ఈ మూవీ ని ఈ రోజు నుండి అనగా ఫిబ్రవరి 10 వ తేదీ నుండి ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తుంది.  ఎవరైనా ఈ మూవీ ని థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ఈ రోజు నుండి ఈ సినిమా ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: