SSMB28: త్రివిక్రమ్ రాజమౌళికి ఏమాత్రం తగ్గట్లేదుగా?

Purushottham Vinay
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28 వ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా చాలా స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా కోసం సారథి స్టూడియోస్ లో పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో ఓ ఓల్డ్ మోడల్ ఇల్లుని సెట్ వేశారట. అది చూడటానికి చాలా అందంగా ఉన్నట్లు సమాచారం.అంతేకాదు ఈ సినిమా షూటింగ్ రెండో షెడ్యూల్ కోసం నగర శివార్లలో అత్యంత భారీ సెట్ ను కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం ఒక షెడ్యూల్ అయిపోయింది. మళ్ళీ ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న ఈ సినిమా షూటింగ్ కోసం దాదాపు 10 కోట్ల రూపాయల వ్యయంతో భారీ సెట్ ని ఏర్పాటు చేస్తున్నారట.ఇప్పటి దాకా టాలీవుడ్ లో ఇంత భారీ సెట్ నిర్మాణం చేయలేదని టాలీవుడ్ ఇండస్ట్రీ కోడై కూస్తోంది.


కొన్ని వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భారీ సెట్ ఉండబోతుందట. అది కూడా కేవలం ఒక్క ఫ్లోర్ మాత్రమేనని సమాచారం తెలుస్తుంది.అయితే ఇంత పెద్ద సెట్ లో ఎలాంటి సీన్ తీయబోతున్నారో అని చాలా మందిలో కూడా ఇప్పుడు ఆసక్తి నెలకొంది. అందులో  మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ లో హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ సినిమాపై చాలా రకాల భారీ అంచనాలు నెలకొన్నాయి. అతడు, ఖలేజా వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం కావడం ఇంకా దీనికోసం అత్యంత భారీ సెట్ ఏర్పాటు చేయడంతో టాలీవుడ్ కన్నంతా కూడా ఈ సినిమాపైనే పడింది. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ కొన్ని రోజుల క్రితం వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: