అడ్డంగా పరువుపోగొట్టుకున్న చిరు?

Purushottham Vinay
గతంలో వచ్చిన క్లాసిక్ హిట్ సినిమాలను ఇప్పుడు రీ రిలీజ్ చేసి  డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నారు మేకర్లు.స్టార్ హీరోలకు ఉన్న సూపర్ క్రేజ్‌ను వాడుకుందామని అనుకుంటున్నారు. కానీ అది అన్ని సార్లు కూడా పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు. అసలు ఈ ట్రెండ్‌ను సూపర్ స్టార్ మహేష్‌ బాబు ఫ్యాన్స్ మొదలుపెట్టేశారు. గత సంవత్సరం మహేష్‌ బాబు బర్త్ డే స్పెషల్‌గా పోకిరి సినిమాను రీ రిలీజ్ చేశారు. ఒక్కడిని కూడా రిలీజ్ చేశారు. ఒక రేంజిలో ఆ రెండు సినిమాలకు రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ బర్త్ డే సందర్భంగా తమ్ముడు, జల్సా సినిమాలను విడుదల చేశారు.ఇలా మహేష్‌ బాబు ఇంకా పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ చేస్తోన్న ట్రెండ్‌లు చూడటం, వాటికి వచ్చిన కలెక్షన్లను చూసి మిగతా హీరోలు కూడా రెడీ అయ్యారు. ఈ క్రమంలో బాలకృష్ణ చెన్నకేశరెడ్డి సినిమాను కూడా రిలీజ్ చేశారు. కానీ దాన్ని ఎవ్వరూ కూడా అంతగా పట్టించుకోలేదు. ఆ సినిమాకి కలెక్షన్లు కూడా చాలా దారుణాతి దారుణంగా వచ్చాయి. ఇక ప్రభాస్ విషయంలో కూడా సేమ్ ఇలానే జరిగింది. బిల్లా, వర్షం సినిమాలు రీ రిలీజ్ చేస్తే అవి కూడా తుస్ మని కలెక్షన్లను రాబట్టలేకపోయాయి.


అయితే ఈ మధ్య మహేష్ ఒక్కడు, పవన్ కళ్యాణ్‌ ఖుషి సినిమాలను  విడుదల చేయగా వాటికి ఒక కొత్త సినిమా వలె కోట్లలో ఆదాయం వచ్చింది. ఖుషి, ఒక్కడు సినిమాలకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆ సినిమాల లెక్కలు చూసి మైండ్ బ్లాక్ అయి ఉంటుంది అందరికీ.ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమాను కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఫిబ్రవరి 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. ఈ మేరకు ప్రమోషన్స్ ని కూడా మొదలుపెట్టేశారు. కానీ చివరి నిమిషంలో విడుదల తేదీని మేకర్స్ మార్చేశారు. పోస్ట్ పోన్ చేశాం.. సినిమాను విడుదల చేయడం లేదని మేకర్స్ చెప్పేశారు. ఇక 4kలోకి మార్చిన తరువాత సరైన అవుట్ పుట్ రాలేదని, అందుకే ఆపేశామని, త్వరలోనే మరో డేట్‌ను ప్రకటిస్తామని ఏవేవో సాకులు చెప్పారు. కానీ అసలు నిజం ఏంటంటే ఆ సినిమాకి అసలు బుకింగ్స్ ఏవి రాలేదు.దీంతో సోషల్ మీడియాలో మహేష్ బాబు  ఫ్యాన్స్ ముందు చిరంజీవి పరువు అడ్డంగా పోయిందని మెగా ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: