ధమ్కీ కి ధమాకా కష్టాలు !

Seetha Sailaja

విజయ్ దేవరకొండ కు యూత్ లో ఎలాంటి మ్యానియా ఉందో విశ్వక్ సేన్ కు కూడ యూత్ లో అంత ఫాలోయింగ్ ఉంది. ‘ఫలక్ నుమా దాస్’ మూవీతో దర్శకుడుగా మారిన ఇతడు మంచి రచయిత కూడ కొన్ని సినిమాల స్క్రిప్ట్ రైటింగ్ లో ఇతడు ఆ రైటింగ్ టీమ్ లో పనిచేసాడు. ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల పై సంచలన కామెంట్స్ చేయడం ఇతడి అలవాటు.

లేటెస్ట్ గా ఇతడు లీడ్ రోల్ చేస్తూ తానే దర్శకత్వం చేసిన ‘థమ్కీ’ మూవీ పై మంచి అంచనాలు ఉన్నప్పటికీ ఈమూవీని వచ్చే వారం విడుదల చేయకుండా వాయిదా వేయడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. వాస్తవానికి వచ్చే వారం విడుదల కావలసిన సమంత ‘శాకుంతలం’ మూవీ వాయిదా పడటంతో ‘ధమ్కీ’ మంచి సక్సస్ అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి.

అయితే ఈ మూవీ విడుదల ఎందుకు వాయిదా పడిందో అన్నవిషయానికి సంబంధించిన వార్తలు ఇప్పుడు లీక్ అవుతున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ కథ రవితేజా బ్లాక్ బష్టర్ మూవీ ‘ధమాకా’ ను పోలి ఉంటుందని టాక్.   ‘ధమాకా’ రిజల్ట్ చూశాక తమ చిత్రాన్ని వాయిదా వేసుకోవడం మంచిది అని విశ్వక్ సేన్ జనవరిలోనే నిర్ణయం తీసుకున్నాడు అని అంటారు.

ఒక బిలియనీర్ స్థానంలోకి ఒక మామూలు వ్యక్తి వెళ్లి అక్కడ వ్యవస్థను చక్కబెట్టే పాయింట్ మీద ‘ధమాకా’ నడిస్తే అదే షెడ్ లో ‘ధమ్కీ’ మూవీ ఉంటుందట. ‘ధమాకా’లో హీరో పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయి కానీ అది ద్విపాత్రాభినయం కాదు. ‘ధమ్కీ’ లో కూడ హీరో పాత్రకు రేణు షేడ్స్ ఉంటాయట. దీనితో ఈమధ్యనే ప్రేక్షకులు ‘ధమాకా’ మూవీని విపరీతంగా చూడటంతో మళ్ళీ అదే షెడ్ కథతో వచ్చిన ‘ధమ్కీ’ ని జనం చూడరు అన్న ఉద్దేశ్యంతో కొద్దిగా గ్యాప్ ఇద్దామని ఈ మూవీ విడుదల వాయిదా పడింది అన్నవార్తలు హడావిడి చేస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: