ఎన్టీఆర్ 30 షూటింగ్ అత్యధిక భాగం ఆ నగరాల్లోనే..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరికొన్ని రోజుల్లో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి చిత్ర బంధం ఇప్పటివరకు టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాను ఎన్టీఆర్ 30 అనే పేరుతో ప్రకటించింది. రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయనున్న ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నాడు.

ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి చియాన్ విక్రమ్ ... బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుండి సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించబోతున్నట్లు సమాచారం. అందులో భాగంగా ప్రస్తుతం ఈ ఇద్దరు నటులతో ఈ మూవీ యూనిట్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ వార్తకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఎన్టీఆర్ ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మార్చి 20 వ తేదీ నుండి లేదా అంత కన్నా ముందే ప్రారంభం కాబోతున్నట్లు ప్రకటించాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని దర్శకుడు కొరటాల శివ పార్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ యొక్క అత్యధిక షూటింగ్ ను హైదరాబాద్ ... గోవా ... విశాఖపట్నంలో భారీ సెట్ లను వేసి తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని దాదాపు 9 భాషలలో విడుదల చేయడానికి ఈ మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: