షన్నుతో రొమాన్స్ పై నోరు విప్పిన సిరి.. శ్రీహాన్ కి సారీ చెబుతూ?

praveen
సాధారణంగా బిగ్ బాస్ హౌస్ అంటేనే కొత్త ప్రేమ జంటలకు కేరాఫ్ అడ్రస్ అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇలా హౌస్ లోకి వచ్చిన వారు ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకొని ప్రేమికులుగా మారిపోవడం ఇప్పటివరకు చాలా సార్లు చూసాం. కానీ బిగ్బాస్ హౌస్ లోకి వెళ్లిన యూట్యూబ్ స్టార్లు సిరి, షన్ను మాత్రం అందరిని ఆశ్చర్యపోయేలా చేసారు అని చెప్పాలి. ఎందుకంటే వీరిద్దరికి కూడా బయట లవర్స్ ఉన్నారు అన్న విషయం ప్రేక్షకులకే కాదు ఇక ఈ ఇద్దరికీ కూడా క్లారిటీ ఉంది.

 ఇక వారి ప్రేమికుల తోనే పెళ్లికి కూడా సిద్ధమయ్యారన్న విషయం కూడా అందరికీ తెలుసు. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఇక వీరిద్దరే డీప్ లవ్ లో ఉన్నట్లుగా హగ్గులు, కిస్సులతో రెచ్చిపోయారు. బిగ్ బాస్ హౌస్ లో వీరిద్దరి రొమాన్స్ ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది. ఫ్రెండ్షిప్ పేరుతో ఇలాంటివి చేసి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటూ తిట్టిపోయడం కూడా చేశారు ప్రేక్షకులు. అయితే ఇక బయటికి వచ్చిన తర్వాత దీప్తి సునైనా అటు షణ్ముఖ్ జస్వంత్ కి బ్రేకప్ చెప్పేసింది. దీంతో సిరి వళ్ళనే వీరి బ్రేకప్ జరిగిందంటూ వార్తలు కూడా హల్చల్ చేసాయ్.

 అయితే అటు శ్రీహాన్ మాత్రం పెద్ద మనసుతో ఇక సిరిని మళ్లీ తన లైఫ్ లోకి ఆహ్వానించాడు అని చెప్పాలి. అయితే ఇక  ఇటీవలే  బిగ్ బాస్ హౌస్ లో షన్నుతో చేసిన రొమాన్స్ గురించి ఇన్ డైరెక్ట్ గా చెబుతూ తన తప్పును ఒప్పుకొని శ్రీహాన్ కు సారీ చెప్పి ఎమోషనల్ అయింది సిరి. వాలెంటెన్స్ డే స్పెషల్ గా స్టార్ మా లో ఒక కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. ఇక ఇందులో సిరి మాట్లాడుతూ స్టేజ్ మీద ఎవరు తప్పులను ఒప్పుకోరు. తెలుసో తెలియకో తప్పులు చేశా.. కానీ ఎన్ని తప్పులు చేసినా శ్రీహాన్ నన్ను ఏమీ అనలేదు అంటూ కన్నీరు పెట్టుకుంది. ఇక తన ప్రియుడు శ్రీహాన్ను కౌగిలించుకుంది. అయితే షన్నుతో చేసిన రొమాన్స్ గురించే సిరి ఇంత ఎమోషనల్ అయి ఉంటుంది అంటూ అందరూ అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: