HBD Sumanth: అక్కినేని సుమంత్ బర్తడే స్పెషల్..!

Divya
అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కూతురు సత్యవతి.. అల్లుడు యార్లగడ్డ సురేంద్ర దంపతుల కుమారుడే సుమంత్ కుమార్.. 1975 ఫిబ్రవరి 9వ తేదీన హైదరాబాద్ తెలంగాణలో జన్మించారు. అక్కినేని మనవళ్లు , మనవరాళ్లతో పాటే సుమంత్ కూడా అక్కడే పెరిగి పెద్దవాడయ్యాడు. ఇతను పుట్టిన కొన్ని నెలల తర్వాత అతని తల్లిదండ్రులు ఇద్దరు అమెరికాకు వెళ్ళవలసి వచ్చింది అయితే సుమంత్ మాత్రం తాత కోరిక మేరకు అక్కడే అక్కినేని దంపతుల దగ్గరే ఉండిపోయారు.
అదే సమయంలో అక్కినేనికి కూడా గుండె సంబంధిత శస్త్ర చికిత్స జరగడం తో సినిమాలకు కొన్నాళ్లు దూరంగా ఉండవలసి వచ్చింది. తాను సినిమాలలో ఊపిరి సలపకుండా ఉన్నందుకే తన పిల్లల బాల్యాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోయాను.  కాబట్టి సుమంత్ ని తానే పెంచాలని నిర్ణయించుకున్నాడు అక్కినేని.. ఆ తర్వాత అతనిని దత్తత కూడా తీసుకొని అన్ని తానే అయి సుమంత్ ని పెంచాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన తర్వాత అమెరికా వెళ్లి మిచికాం విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కోర్స్ లో చేరిన అది నచ్చక చికాగోలో కొలంబియా కాలేజీలో ఫిలిం కోర్స్ లో చేరి డిగ్రీ పట్టా అందుకున్నాడు.
ఆ తర్వాత 2004 సంవత్సరంలో సహనాటి కీర్తి రెడ్డిని వివాహం చేసుకొని కొన్ని మనస్పర్ధలు కారణంగా 2006లో విడాకులు తీసుకున్నాడు.  మరొకవైపు కీర్తి రెడ్డి విదేశాలలో డాక్టర్లు వివాహం చేసుకొని సెటిల్ కాగా కి సుమంత్ మాత్రం ఇంకా ఒంటరిగానే మిగిలిపోయారు. 1995 రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ప్రేమ కథ చిత్రం ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి యువకుడు సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నాడు. ఆ తర్వాత సత్యం,  గౌరీ,  గోదావరి,  చిన్నోడు,  మధుమాసం,  పౌరుడు వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అంతేకాదు ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో అతని తాత అక్కినేని పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు కూడా పొందాడు సుమంత్. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ విలన్ క్యారెక్టర్లలో దూసుకుపోతున్నాడు. ఇటీవల సీతారామం సినిమా ద్వారా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

HBD

సంబంధిత వార్తలు: