ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన సమంత..!!

murali krishna
సమంత మయోసైటిస్ వ్యాధి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది.వరుస ప్రాజెక్ట్ లతో సమంత బిజీ కానున్నారు. శాకుంతలం సినిమా విడుదల తేది మారిన నేపథ్యంలో సమంత ఇతర సినిమాలు, వెబ్ సిరీస్ ల షూటింగ్ లతో బిజీ బిజీ అవుతున్నారు.

అయితే ముంబై లో తాజాగా సమంత లగ్జరీ ఇల్లును కొనుగోలు చేయడం సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ అవుతోంది. ముంబైలో సమంత కొనుగోలు చేసిన ఇంటి విలువ ఏకంగా 15 కోట్ల రూపాయలు అని తెలుస్తుంది..
సమంత వరుస ప్రాజెక్ట్ ల లో బిజీ బిజీగా ఉండటం వల్లే ప్రముఖ ప్రాంతాలలో లగ్జరీ ఇళ్లను కొనుగోలు చేయగలుగుతున్నారని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. సమంత కు టాలీవుడ్ స్టార్స్ ఛాన్స్ ఇవ్వడం లేదు. సమంతకు అవకాశం ఇస్తే అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇబ్బందులు వస్తాయేమో అని భావించి కొంతమంది స్టార్స్ ఆమెకు ఛాన్స్ ఇవ్వడం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం విశేషం.
సమంతకు హైదరాబాద్ మరియు చెన్నైలలో ఇప్పటికే ప్రాపర్టీస్ ఉండగా ముంబై ప్రాపర్టీలను కొనుగోలు చేయడానికి ఆమె ఆసక్తి చూపిస్తుండటం విశేషం. సమంతకు ప్రముఖ వెబ్ సిరీస్ లలో ఆఫర్లు వస్తుండగా ఏయే ఆఫర్లకు సామ్ ఓకే చెబుతారో చూడాలి. చైతన్యతో సమంత కలిసి నటించే అవకాశాలు అయితే దాదాపుగా లేవని సమాచారం అందుతోంది. చైసామ్ విడిపోవడానికి కారణాలు మాత్రం ఇప్పటికి కూడా ఎవరికీ తెలియవు.
మిగతా అక్కినేని హీరోలతో మాత్రం సమంతకు సత్సంబంధాలు ఉన్నాయని సమాచారం.. సమంత పారితోషికం 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా విజయాలు దక్కుతుండటంతో సమంత పారితోషికం ఈ రేంజ్ లో ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. సమంత ప్రస్తుతం ఖుషి సినిమాను పూర్తి చేసే పనిలో వుంది. దానితో పాటు మరో వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: