రైటర్ పద్మభూషణ్: బ్లాక్ బస్టర్.. భారీ వసూళ్లు?

Purushottham Vinay
సినిమాల్లో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి తమ మాటలతో మంచి గుర్తింపు తెచ్చుకోని ఎదిగి ఆ తరువాత కలర్ ఫోటో సినిమాతో హీరో అయ్యాడు సుహాస్.ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరో అయ్యాడు. ఈ సినిమా తరువాత సుహాస్ కి భారీగా ఆఫర్స్ వచ్చాయి. ఇక సుహాస్ హీరోగా చేసిన రైటర్ పద్మభూషణ్ సినిమా ఈమధ్యనే ఫిబ్రవరి 3 వ తేదీన థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమాలో సుహాస్ సరసన టీనా శిల్పారాజ్ హీరోయిన్ గా చేయగా రోహిణి ఇంకా ఆశిష్ విద్యార్ధి సుహాస్ అమ్మానాన్నలుగా చేసి ఎంతగానో మెప్పించారు.రిలీజయిన మొదటి రోజు నుంచే ఈ సినిమా డీసెంట్ టాక్ తెచ్చుకొని, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకొని థియేటర్స్ కి రప్పిస్తుంది. కామెడీ, ఎమోషనల్ ఇంకా ముఖ్యంగా అమ్మ సెంటిమెంట్ ఉండటంతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకి ఎంతగానో నచ్చుతుంది. దీంతో చిన్న సినిమాగా రిలీజయిన రైటర్ పద్మభూషణ్ సినిమా ఇప్పుడు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతుంది. ఈ సినిమాకి పేరుతో పాటు కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి.చాలా తక్కువ క్యాస్ట్, తక్కువ లొకేషన్స్ ఇంకా తక్కువ టైంలో, ఒక 10 మంది తప్పితే మిగిలిన వాళ్లంతా కూడా చిన్న చిన్న ఆర్టిస్టులతోనే ఈ సినిమా తెరకెక్కించడంతో కేవలం 2-3 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని ఈజీగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమాని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ డిస్ట్రిబ్యూట్ చేశారు.


రైటర్ పద్మభూషణ్ సినిమా మొదటి రోజు నుంచి కూడా చాలా మంచి కలెక్షన్స్ ని రాబడుతుంది. మొదటి రోజుతో పాటు వీకెండ్స్ అయిన శని, ఆదివారాలు కలుపుకొని మూడు రోజుల్లో దాదాపు 5.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని ఈ సినిమా వసూలు చేసింది. అంటే దాదాపు 3 కోట్ల దాకా షేర్ కలెక్షన్స్ వచ్చాయి. సోమవారం నాడు కూడా ఇంకో కోటి రూపాయల దాకా గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టు సమాచారం. ఇక అమెరికాలో కూడా ఈ సినిమా భారీగా కలెక్షన్స్ రాబడుతుంది. అమెరికాలో ఇప్పటికే 250K డాలర్స్ కి పైగా కలెక్ట్ చేసినట్టు సమాచారం తెలుస్తుంది. ఇంకా థియేటర్స్ లో మంచి రన్ నడుస్తుండటంతో కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమాని ప్రేక్షకులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా చూసి ఎంతగానో అభినందిస్తున్నారు. దీంతో ఈ సినిమా ఇప్పటికే లాభాల్లో నడుస్తుండగా సుహాస్ హీరోగా ఈ సినిమాతో మళ్ళీ హిట్ కొట్టేసి తెలుగులో మంచి మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: