కంగనా గట్టి వార్నింగ్ ఇచ్చిందిగా...!!

murali krishna
కంగనా రనౌత్ ఎప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ నటి తనను ఎవరో టార్గెట్ చేశారని కూడా చెబుతోంది.
అంతే కాకుండా పరోక్షంగా రణ్‌బీర్ కపూర్ మరియు ఆలియా భట్‌ను ఉద్దేశించి చేసినట్లు నెటిజన్లు కూడా కామెంట్స్ చేశారు. నా ప్రతి కదలికను వారు గమనిస్తున్నారని కూడా పేర్కొంది. అయితే ఆమె ఈ ప్రకటన చేసిన ఒక్కరోజులోనే తనను ఫాలో చేస‍్తున్నవారు వెనక్కి తగ్గారని కూడా ఆమె వివరించింది. ప్రస్తుతం తనపై నిఘా విరమించుకున్నారని కూడా తెలిపింది.
ఈ సందర్భంగా తనపై గూఢచర్యం చేస్తున్నారని ఆరోపించిన చాంగు మంగు 'ఫిల్మ్ మాఫియా'కు కంగనా గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది. నేను ఏమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నారా? ఇంట్లోకి దూరి మరీ కొడతా అంటూ ఓ రేంజ్‌లో అయితే వార్నింగ్ ఇచ్చింది.. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ కూడా చేసింది. 'మై పాగల్ హు, ఘర్ మే ఘుస్ కే మారుంగి' అంటూ హిందీలో కూడా రాసుకొచ్చింది. గూఢచర్యంపై ప్రకటన చేసిన ఒక రోజులోనే తన చుట్టూ ప్రస్తుతం ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరగడం లేదని కూడా తన అనుచరులకు ఆమె తెలిపింది.
తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాస్తూ.. 'నా గురించి ఆందోళన చెందుతున్న వారందరికీ దయచేసి నా నుండి హెచ్చరిక వినండి. గత రాత్రి నుంచి నా చుట్టూ ఎటువంటి అనుమానాస్పద కార్యకలాపాలు అయితే జరగలేదు. కెమెరాలతో ఎవరూ కూడా నన్ను అనుసరించలేదు. ఆ చాంగు మంగు గ్యాంగ్‌కు నేను ఒకటే చెబుతున్నా. నేను పిచ్చిదాన్ని అని మీరు అనుకుంటే అది పెద్ద పొరపాటే. ఇందులో ఎంత పెద్దవారైనా సరే వదిలే ప్రసక్తే లేదని ఇంట్లోకి దూరి మరీ కొడతా.' అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చింది కంగనా రనౌత్.
 కంగనా తదుపరి ఎమర్జెన్సీ చిత్రంలో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుందని తెలుస్తుంది.. రజనీకాంత్ తమిళ చిత్రానికి సీక్వెల్ 'చంద్రముఖి 2'లో కూడా తాను నటిస్తానని కంగనా ప్రకటించిందట..ఆ తర్వాత 'తేజస్'లో కూడా కనిపించనుంది, ఇందులో ఆమె ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రను కూడా పోషించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: