పఠాన్: అక్కడ బాహుబలి2 రికార్డ్ ఔట్.. కానీ?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ నటులు షారుఖ్ ఖాన్ , దీపికా పడుకొనే, జాన్ అబ్రహం నటించిన పఠాన్ సినిమా విడుదల అయ్యి ఎన్నో రికార్డులు సృష్టిస్తుంది. బాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్ మేకర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ సినిమా  కలెక్షన్స్ లో దూసుకుపోతూ బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ అయిన సంగతి తెలిసిందే.విడుదల రోజు నుంచి మంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకొని భారీగా వసూలు చేస్తుంది. ఈ సినిమాతో చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత షారుఖ్ ఖాన్ తన రేంజ్ హిట్ కొట్టడమే కాకుండా గత కొంతకాలంగా వరుస భారీ ఫ్లాపులతో సతమతమవుతున్న బాలీవుడ్ కి పెద్ద విజయాన్ని అందించాడు. ఇప్పటికే పఠాన్ సినిమా కలెక్షన్స్ తో చాలా రికార్డులని బద్ధలు కొడుతుంది.పఠాన్ సినిమా జనవరి 25 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజయింది. అయిదు రోజుల్లోనే ఏకంగా 550 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన పఠాన్ సినిమా ఆ తర్వాత కొంచెం స్పీడ్ తగ్గి కలెక్షన్స్ ని మెల్లిగా వసూలు చేసుకుంటూ వస్తుంది.


ఇప్పటికే 12 రోజుల్లో పఠాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 850 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. అంటే దాదాపు 420 కోట్లకి పైగా షేర్ కలెక్షన్స్ ని ఈ సినిమా వసూలు చేసింది. దీంతో మరిన్ని రికార్డులు క్రియేట్ చేసింది పఠాన్. నార్త్ అమెరికాలో అయితే ఇప్పటికే బాహుబలి 2 వసూళ్ళని దాటేసినట్లు సమాచారం తెలుస్తుంది. ఇంకో రెండు మూడు రోజుల్లో ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉంది. అయితే ఫుల్ రన్ లో బాహుబలి 2, దంగల్ సినిమాలు ఎక్కువ వసూళ్లు చేసిన సినిమాలుగా చరిత్రలో నిలిచిపోయాయి.ఈ సినిమా 1000 కోట్లు దగ్గరే ఆగిపోయే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం జనాలు ఎంత పెద్ద హిట్ సినిమా అయినా కేవలం ఒక నెల రోజులు మాత్రమే చూస్తారు.మరి చూడాలి ఫుల్ రన్ లో ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: