కేవలం అన్ని కోట్ల లాభాలను మాత్రమే అందుకున్న "వారసుడు" మూవీ..!

Pulgam Srinivas
కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ ఈ సంవత్సరం పొంగల్ కానుకగా వారిసు అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ భారీ అంచనాల నడుమ తమిళ భాషలో జనవరి 11 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి తమిళ్ భాషలో అద్భుతమైన  టాక్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను తెలుగు లో వారసుడు పేరుతో జనవరి 14 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ కి తెలుగు లో పర్వాలేదు అనే రేంజ్ టాక్ లభించింది అయినప్పటికీ ఈ సినిమాకు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా పర్వాలేదు అనే రేంజ్ కలెక్షన్ లు లభించాయి.

ఈ క్రేజీ మూవీ కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా ... దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి తమన్ సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ మూవీ పై అద్భుతమైన అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొన్నాయి. దానితో ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా 137.90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా 139 కోట్ల భారీ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది.

ఇలా భారీ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటివరకు 26 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 26 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 150.42 కోట్ల షేర్ , 294.77 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ కి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 11.42 కోట్ల లాభాలు మాత్రమే దక్కాయి. ఇప్పటికే అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను సాధించిన ఈ సినిమాకు జరిగిన భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ కారణంగా ఎక్కువ లాభాలు ప్రపంచవ్యాప్తంగా దక్కలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: