సుహాస్ వల్లే ఆహా సక్సెస్ అయ్యింది: అల్లు అరవింద్

Purushottham Vinay
తెలుగు ఓటిటి ప్లాట్‌ఫార్మ్ అయిన ఆహా జనాల్లో ఎంత మంచి పాపులారిటీ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ కాలంలోనే విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకుంది ఈ తెలుగు ఓటిటి ప్లాట్‌ఫార్మ్.ఇక టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో అయితే ఇండియాలోనే హైయెస్ట్ రీచ్ ని సొంతం చేసుకున్న షోగా రికార్డు సృష్టిస్తుంది. ఎందుకంటే ఈ షోకి చాలా పెద్ద పెద్ద స్టార్ హీరోలు ఇంకా రాజకీయ ప్రముఖులు రావడం వల్ల జనాలకు ఈ షో పట్ల చాలా ఆసక్తి పెరిగింది.అయితే ఈ ఆహా నిలబడడానికి మాత్రం ఒక చిన్న హీరో కారణం అంటున్నాడు ఆహా అధినేత అల్లు అరవింద్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి వచ్చి కమెడియన్‌గా, విలన్‌గా ఇంకా అలాగే హీరోగా నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ‘సుహాస్’.సుహాస్ హీరోగా నటించిన తాజా సినిమా ‘రైటర్ పద్మభూషణ్’. ఈ సినిమా ఈమధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అల్లు అరవింద్ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు.


సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో మూవీ యూనిట్ ఇక సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. బన్నీ వాసు నా దగ్గరకి వచ్చి రైటర్ పద్మభూషణ్ సినిమాని మనం విడుదల చేద్దాం అన్నాడు. మొదటిలో నేను అంతగా ఆసక్తి చూపించలేదు, కానీ సినిమా చూసిన తరువాత తప్పకుండా విడుదల చేయాలి అనిపించింది.ఈరోజు మాకు చాలా మంచి విజయాన్ని అందించింది ఈ చిత్రం. సుహాస్ హీరోగా తెరకెక్కిన రెండో సినిమా ఇది. అతను హీరోగా తెరకెక్కిన మొదటి సినిమా కూడా మీమే రిలీజ్ చేశాము. లాక్‌డౌన్ టైంలో వచ్చిన కలర్ ఫోటో సినిమాని ఆహా ద్వారా డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ చేశాము. అది ఎంత పెద్ద హిట్టు అయ్యిందో అందరికి తెలుసు. మా ఆహాకు అదే మొదటి విజయం. ఆ సినిమాకు వచ్చిన ప్రజాధారణ మా ఆహాకు  రీచ్ మరింత బాగా పెరిగేలా చేసింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో టీనా శిల్పారాజ్ హీరోయిన్ గా నటించింది. రోహిణి ఇంకా ఆశిష్ విద్యార్ధి ప్రధాన పాత్రలు పోషించారు.అలాగే శేఖర్ చంద్ర సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: