"ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం" మూవీకి మొదటిసారి వచ్చిన "టిఆర్పి" రేటింగ్ ఇదే..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నరేష్ తన కెరియర్ ప్రారంభంలో ఎక్కువ శాతం కామెడీ ప్రాధాన్యత ఎక్కువ ఉన్న సినిమా లలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ తరువాత కామెడీ సినిమాలతో పాటు తన నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో కూడా నటించి తన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు.

ఇలా కామెడీ సినిమాలతో ... వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న నరేష్ తాజాగా ఇట్లే మారేడుమిల్లి ప్రజానికం అనే మూవీ లో హీరో గా నటించాడు. ఏ ఆర్ మోహన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నరేష్ సరసన ఆనంది హీరోయిన్ గ నటించగా శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో మంచి అంచనాల నడుమ విడుదల అయ్యింది. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయినా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ మూవీ గా నిలిచిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే బుల్లి తెరపై ప్రసారం అయింది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితమే జీ సంస్థ వారు జీ తెలుగు లో ప్రసారం చేశారు. మొదటి సారి ఈ మూవీ జీ తెలుగు లో ప్రసారం అయినప్పుడు 3.41 "టి ఆర్ పి" ని సొంతం చేసుకుంది. ఇలా థియేటర్ లలో ప్రేక్షకులను పర్వాలేదు అనే రేంజ్ లో అలరించిన ఈ మూవీ బుల్లి తెరపై కూడా ప్రేక్షకులను పరవాలేదు అనే రేంజ్ లోనే అలరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: