మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ మిస్ అవ్వడంతో ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళాను :సమీరా రెడ్డి

murali krishna
సమీరా రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ సరసన నరసింహుడు చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత చిరంజీవి సినిమాలో కూడా నటించింది. కానీ ఆ తరువాత టాలీవుడ్ లో అంతగా కనిపించలేదు.

 టాలీవుడ్ కంటే ముందుగానే బాలీవుడ్‌ అరంగ్రేటం చేసింది సమీర రెడ్డి. తెలుగులో చిరంజీవి సరసన జై చిరంజీవ, జూనియర్ ఎన్టీఆర్‌తో అశోక్ మరియు రానా మూవీ కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో  కూడా నటించింది. ఆ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసిందిట ముంబయి చిన్నది.

తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో ఓ ఆసక్తికర పోస్ట్ ను పోస్ట్ చేసింది. 1998లో ఒక తెలుగు సినిమా ఆడిషన్స్‌కు హాజరైన సంగతిని వెల్లడించింది. ఆ టాలీవుడ్ హీరో ఆడిషన్స్‌లో సరైన ఫర్మామెన్స్ చేయకపోవడంతో ఏడ్చుకుంటూ మరి ఇంటికెళ్లానని ఆమె చెప్పుకొచ్చింది. అది కాస్తా సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఇది చూసిన అభిమానులు కూడా తెగ కామెంట్స్ చేస్తున్నారు.

సమీరా రెడ్డి తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' అప్పుడు నేను మహేశ్ బాబు సినిమా ఆడిషన్‌కు వెళ్లాను . ఆరోజు నాకు ఎంతో భయమేసింది. దాంతో సరైన ప్రదర్శన ను నేను ఇవ్వలేకపోయా. ఇంటికి తిరిగి వెళ్తూ ఏడ్చేశాను. ఆ తర్వాత ఓ నిర్ణయానికి అయితే వచ్చేశా. నేను రెండేళ్లు పని చేసిన వాచ్‌ కంపెనీలోనే ఉండాలని బాగా డిసైడ్ అయిపోయా. నా ముఖానికి డెస్క్ జాబే కరెక్ట్ అనుకున్నాను. కానీ ఆ తర్వాత నేను మళ్లీ కాస్త ధైర్యం తెచ్చుకుని బాలీవుడ్‌లో అహిస‍్తా కీజియో బాటియన్ మ్యూజిక్ వీడియోను చేసాను.' ఆ ఆడిషన్స్‌ ఫోటోలు కూడా పంచుకుంది. ఇది చూసిన సమీరా ఫ్యాన్స్ మాత్రం తెగ కామెంట్స్ చేస్తున్నారు. అప్పుడే మీరు చాలా అందంగా ఉన్నారంటూ కూడా మరికొందరుకామెంట్స్ చేసారు.

 సమీర సినిమాలకు దూరమయ్యాక 2014లో అక్షయ్ వర్దేను పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో తన వ్యక్తిగత విషయాలు కూడా షేర్ చేసుకుంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: