మైఖేల్: సందీప్ యాక్షన్ మూవీ ఎలా ఉందంటే?

Purushottham Vinay
తెలుగు యువ నటుడు సందీప్ కిషన్  యాక్షన్ కథతో చేసిన పాన్ ఇండియా సినిమా మైఖేల్. రంజిత్ జయకొడి అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ట్రైలర్ తో సినిమా కొంచెం డిఫరెంట్ గా ఉంటుందనే అంచనాలు కలిగించింది.ఇక నేడు ఈ సినిమా థియేటర్ లో విడుదలయ్యి ఆ స్థాయిలో మెప్పించిందో లేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక ఈ సినిమా ప్రారంభంలో వచ్చే వాయిస్ ఓవర్ నుంచి చివరి దాకా  కేజీఎఫ్ ప్రభావం చాలా అనేది స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఎడిటింగ్ షాట్స్ కూడా అలాగే తీశారు. అయితే ఆ సినిమాలో పదునైన సంభాషణలు, అద్భుతమైన నేపథ్య సంగీతం ఇంకా హీరోయిజంని ఎలివేట్ చేసే సీన్స్ ఆకట్టుకున్నాయి.మైఖేల్ లో అవన్నీ కూడా బాగానే పండాయి. సందీప్ కిషన్ తన పాత్ర మేరకు కొంచెం సెటిల్డ్ పర్మార్మెన్స్ చేశాడు. యాక్షన్ సీక్వెన్సుల్లో అతని కష్టం బాగానే కనిపించింది.  తన నటనలో ఒక మూడ్ ని మెయింటేన్ చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్ దివ్యాంశది కథలో కీలక పాత్ర.


అటు గ్లామర్ ఇంకా పర్మార్మెన్స్ లో ఆమె చాలా బాగా ఆకట్టుకుంది.డాన్ గా డైరెక్టర్ గౌతమ్ మీనన్ అంతగా మెప్పించలేదు. తమిళ్ కు పనికొస్తుందని ఆయన్ని తీసుకున్నారేమో గానీ తెలుగులో  మన ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే పెద్ద పేరున్న నటుడు చేయాల్సిన క్యారెక్టర్ అది. డాన్ కొడుకుగా వరుణ్ సందేశ్ పర్వాలేదు గానీ అతని కెరీర్ కు ఈ క్యారెక్టర్ వల్ల అంతగా లాభమేమీ ఉండకపోవచ్చు. సెకండాఫ్ లో వచ్చే విజయ్ సేతుపతి ఇంకా వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రలను అంత బలంగా వాడుకోలేకపోయాడు దర్శకుడు. సినిమాలో రిచ్ మేకింగ్, ప్రొడక్షన్ వ్యాల్యూస్, టెక్నికల్ గా ఉన్నత స్థాయి విలువలు బాగానే కనిపిస్తాయి. 80, 90ల నాటి వాతావరణాన్ని తెరపై బాగానే రీ క్రియేట్ చేశారు. సినిమాటోగ్రఫీ ఇంకా సంగీతం బాగానే ఆకట్టుకుంటాయి. యాక్షన్ ఎంటర్ టైనర్స్ ఇష్టపడే ప్రేక్షకులు మైఖేల్ సినిమాని బాగా లైక్ చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: