కళాతపస్వి శ్రీ కె. విశ్వనాథ్ సినిమా కెరీర్ ఎలా మొదలైంది?

Purushottham Vinay
ప్రముఖ లెజెండరి దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్ గారు కన్నుమూశారు. ఇక విశ్వనాథ్ గారి మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కూడా షాక్ కి గురైంది. పరిశ్రమలో చాలా తీవ్ర విషాదం అలుముకుంది. ఇండస్ట్రీకి చాలా పెద్ద దిక్కును కోల్పోయినట్లు అయ్యింది. కె.విశ్వనాథ్  గారు ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతోంది సినీ లోకం.ఆయన మరణవార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. పలువురు ప్రముఖులు కె విశ్వనాథ్ గారితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.కొంతకాలం నుంచి అనారోగ్యంతో ఉన్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తన తుదిశ్వాస విడిచారు.గుంటూరు జిల్లా రేపల్లెలో 1930 ఫిబ్రవరి 19న కాశీనాథుని విశ్వనాథ్‌ గారు జన్మించారు.గుంటూరు హిందూ కాలేజీలో ఆయన ఇంటర్ చదివారు. తరువాత ఆంధ్రా యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశారు.


కళాతపస్వి శ్రీ కె. విశ్వనాథ్ సినిమా కెరీర్ ఎలా మొదలైంది?

విశ్వనాథ్ గారి తండ్రి చెన్నైలోని విజయవాహిని స్టూడియోలో పనిచేసేవారు.దీంతో విశ్వనాథ్ గారు తన డిగ్రీ పూర్తికాగానే అదే స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు.పాతాళభైరవి సినిమాకు మొదటిసారి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు ఇంకా డాక్టర్ చక్రవర్తి సినిమాలకు పని చేశారు.ఇక 1965లో వచ్చిన ఆత్మగౌరవం సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన కె.విశ్వనాథ్‌ ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు.మొదటి సినిమాకే ఆయన నంది అవార్డు అందుకున్నారు.. విశ్వనాథ్ గారు 50కిపైగా సినిమాలకు దర్శకత్వం వహించారు.సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సప్తపది, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శ్రుతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, స్వాతికిరణం ఇంకా అలాగే ఆపద్భాందవుడు వంటి ఎన్నో క్లాసికల్‌ సినిమాలను ఆయన తెలుగు ప్రేక్షకులకు అందించారు.బాలీవుడ్‌లో కూడా 9 సినిమాలకు దర్శకత్వం వహించారు.ఇక ఆయన చివరిగా అల్లరి నరేష్ హీరోగా శుభ సంకల్పం అనే సినిమాని ఆయన తెరకెక్కించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: