ప్రభాస్ లేటెస్ట్ మూవీ నుండి లేటెస్ట్ అప్డేట్..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మిర్చి మూవీ వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగిన ప్రభాస్ "మిర్చి" మూవీ తర్వాత దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి ది బిగినింగ్ ... బాహుబలి ది కంక్లూజన్ మూవీ లతో ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

దానితో ప్రస్తుతం ప్రభాస్ వరుస పెట్టి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లలో మరియు అంతకు మించిన మూవీ లలో హీరో గా నటిస్తూ తన కెరియర్ గ్రాఫ్ ను పెంచుకుంటూ వెళుతున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్ కే అనే భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అమితా బచ్చన్ ... దిశ పటాని ఈ మూవీ లో ఇతర కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ మూవీ యూనిట్ కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా ప్రభాస్ హీరో గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్ కే మూవీ ని రెండు భాగాలుగా విడుదల చేయడానికి ఈ మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు ఒక వార్త వైరల్ అయింది. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రాజెక్ట్ కే మూవీ ని రెండు భాగాలుగా కాకుండా కేవలం ఒకే భాగంగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: