"వాల్తేరు వీరయ్య" మూవీకి ఇప్పటివరకు వచ్చిన లాభాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి బాబీ దర్శకత్వం వహించగా శృతి హాసన్ ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో నిర్మించగా , ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , బాబి సింహ విలన్ పాత్రలలో నటించారు.

మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. క్యాథరిన్ ఈ మూవీ లో రవితేజ కు భార్య పాత్రలో నటించింది. ఈ మూవీ ఈ సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన టాక్ రావడంతో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించాయి. ఈ సినిమా విడుదల ఇప్పటికే 21 రోజులు పూర్తి అయినప్పటికీ ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉండడంతో ఈ మూవీbకి ప్రపంచవ్యాప్తంగా 88 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా 89 కోట్ల బ్రేక్ ఈవెన్  టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగగా 21 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 134.83 కోట్ల షేర్ , 230.02 గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. దానితో ఈ సినిమాకు 21 రోజుల బాక్స్ ఆఫీసర్ ముగిసే సరికి 45.83 కోట్ల లాభాలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: