షాక్..ప్రముఖ డైరెక్టర్ మృతి..!!

Divya
తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. గత ఏడాది కాలం నుంచి ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు సినీ సెలెబ్రెటీస్, ప్రముఖుల సైతం మరణిస్తూనే ఉన్నారు. దీంతో అభిమానుల సైతం చాలా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఇక వారి మరణ వార్తలు మరవకముందే.. కొన్ని రోజుల క్రితమే అలనాటి హీరోయిన్ జమున మృతిచెందగా ఇప్పుడు తాజాగా మరొక విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ డైరెక్టర్ సాగర్ మృతి చెందడం జరిగింది. చెన్నైలో ఆయన నివాసం ఉంటున్న ఇంట్లో ఈరోజు ఉదయం 5:20 నిమిషాలకు తుది శ్వాస విడిచినట్లుగా సమాచారం

ఇక డైరెక్టర్ సాగర్ తెలుగులో స్టువర్టపురం, అమ్మ దొంగ వంటి సినిమాలకు దర్శకత్వం వ్యవహరించారు. అంతేకాకుండా తెలుగు లో ఎంతోమంది దర్శకులు కూడా ఈయన కింద పనిచేసిన వారు ఉన్నారట. దర్శక సంఘానికి కూడా మూడుసార్లు అధ్యక్షుడిగా పనిచేసినట్లు తెలుస్తోంది.సాగర్ మరణించిన వార్త తెలియగానే ఇండస్ట్రీలోని ప్రముఖుల సైతం సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఈయన మరణ వార్త విని ఆయన ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటున్నారు సినీ ప్రముఖులు. ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లుగా ఒక వెలుగు వెలిగిన దర్శకులలో వివి వినాయక్ , శ్రీనువైట్ల ఏఎస్ రవికుమార్ చౌదరి వంటి వారు ఎంతోమంది ఈయన దగ్గర పనిచేశారట.

తెలుగు సినిమా దర్శకుల సంఘానికి కూడా అధ్యక్షుడుగా పనిచేస్తున్న సమయంలో ఆయన అందరితో బాగా కలివిడిగానే ఉండేవారని తెలుస్తోంది. ఎలాంటి వారినైనా తేడా లేకుండా చూసేవారని సినీ ప్రముఖులు సైతం తెలియజేస్తూ ఉన్నారు. వయసులో తనకన్నా చిన్న వారిని కూడ నాన్న అంటూ ఆప్యాయంగా పలకరించేవారట. ఇలా ఎంతో మంచి వ్యక్తి అయినా సాగర్ మరణించడంతో ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు అభిమానులు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతొంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన అభిమానులతో పాటు మనం కూడా కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: