నిజంగా గ్రేట్.. యాంకర్ సుమ ఎంత గొప్ప పని చేసింది?

praveen
తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా యాంకర్ సుమ గురించి కొత్తగా పరిచయం చేస్తే అది అతిశయోక్తి అవుతుంది అని చెప్పాలి. ఎందుకంటే దాదాపు రెండు దశాబ్దాల నుంచి కూడా తెలుగు బుల్లితెరపై మకుటం లేని మహారాణిగా కొనసాగుతుంది యాంకర్ సుమ. చెప్పుకోవడానికి మలయాళ అమ్మాయి అయినప్పటికీ అటు తెలుగులో మాత్రం తన వాక్చాతుర్యంతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక సుమ ఏదైనా షోకి హోస్టింగ్ చేస్తుందంటే చాలు ఆ షో సూపర్ హిట్ కావడం ఖాయం అనే విధంగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది అని చెప్పాలి.

 ఇక సుమలాగా ఇంత లాంగ్ టైం ఎంటర్టైన్మెంట్ పంచిన వారు తెలుగు బుల్లితెరపై మరొకరు లేరు అనడంలోనూ అతిశయోక్తి లేదు. అయితే ఒకవైపు స్టార్డంతో పాటు మరోవైపు కోట్ల రూపాయల ఆస్తి కూడా సంపాదిస్తుంది ఈ యాంకరమ్మా. అయితే సుమ యాంకరింగ్ లైఫ్ గురించి మాత్రమే అందరికీ తెలుసు. కానీ సుమా బయటకు చెప్పుకోని ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుంది అన్నది అప్పుడప్పుడు ఇక సుమా ప్రమేయం లేకుండానే బయటకు వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలాగే మీడియా కవరేజీ లేని ఒక గొప్ప పనిని మొదలుపెట్టిందట యాంకర్ సుమ.

 ఇటీవల సుమ మద్రాసులోని ఐఐటి కాలేజీ కి వెళ్ళింది. ఇక అక్కడ స్టూడెంట్స్ తో ఎంతో సరదాగా గడిపింది. అయితే ఇక స్టూడెంట్స్ కోసం ఏదో ఒకటి చేయాలి అనుకున్న లేదంటే లావైపోతానేమో అనే భయం వేసింది అంటూ అసలు విషయాన్ని ఇక సీరియస్ గా కాకుండా ఫన్నీగా చెప్పేసింది. ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్ అనే సంస్థ నా డ్రీం. ఎందుకంటే వచ్చే దాంట్లో నేను తినడమే కాదు అందరికీ ఏదో ఒకటి చేయాలని ఉద్దేశంతో కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాను. ఇక నా వంతుగా 30 మంది స్టూడెంట్స్ ని అడాప్ట్ చేసుకొని చదివిస్తున్నాను. ఇక ఆ స్టూడెంట్స్ చదువుకొని బాగా సెటిల్ అయ్యేంతవరకు కూడా బాధ్యత నాది. నేను వాళ్లతోనే ఉంటాను. అమెరికాలో ఉన్న ఎఫ్ఐఏ సంస్థలు కూడా మాతో కలిసి పని చేస్తున్నారు అంటూ సుమ తెలిపింది. ఇంత గొప్ప పని చేస్తూ సుమ ఎక్కడ బయట ప్రచారం చేసుకోలేదే అని ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ మరింత గర్వపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: