నాగబాబు మాటలలో ఆంతర్యం !

Seetha Sailaja

మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉండటమే కాకుండా మెగా అభిమానులతో చాల టచ్ లో ఉంటాడు. ప్రస్తుతం ‘జనసేన’ పార్టీ కార్యకలాపాలలో చాల యాక్టివ్ గా ఉండటమే కాకుండా పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయాలి అన్న ధ్యేయంతో తరుచు అధికార పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ నిరంతరం వార్తలలో కొనసాగుతున్నాడు.

ఈమధ్య ఒక మీడియా సంస్థ ప్రతినిధితో నాగబాబు మాట్లాడినట్లుగా వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన కొడుకు యంగ్ హీరో వరుణ్ తేజ్ పెళ్ళి గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ పెళ్ళి త్వరలో జరగబోతోందని అయితే ఆవివరాలు తాను చెప్పనని త్వరలో స్వయంగా వరుణ్ తేజ్ వివరిస్తాడు అని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం వరుణ్ తేజ్ తన వద్ద లేడని అతడు వేరే ఇంటిలో ఉంటున్నాడని అయినప్పటికీ తామంతా కలిసే ఉన్నాము అంటూ అని చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు తమ పిల్లల విషయంలో తాను పూర్తి స్వేచ్చ వారికి ఇస్తానని అంటూ వారి జీవితం వారికి నచ్చే విధంగా మార్చుకోవడానికి ఒక తండ్రిగా తాను ఎప్పుడూ సహకరిస్తాను అని చెప్పినట్లు కూడ వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి గత కొంత కాలంగా వరుణ్ తేజ్ పెళ్ళి పై రకరకాల గాసిప్పులు సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న విషయం తెలిసిందే.
ఆమధ్య వరుణ్ తేజ్ ఒక హీరోయిన్ తో చాల సన్నిహితంగా ఉంటున్నాడని ఆమెను ప్రేమించడమే కాకుండా పెళ్ళి చేసుకుంటాడని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను అప్పట్లో నాగబాబు ఖండించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ నాగబాబు వరుణ్ తేజ్ పెళ్ళి ప్రస్తావన తీసుకు వచ్చాడు కాబట్టి అతడు పెళ్ళి చేసుకునే అమ్మాయి ఎవరు అంటూ మళ్ళీ రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ‘గని’ పరాజయం తరువాత వరుణ్ తేజ్ తన సినిమాల కథల ఎంపిక విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: