విజయ్ అభిమానులకు సామ్ క్షమాపణలు?

Purushottham Vinay
హాట్ బ్యూటీ సామ్ ఆనారోగ్యం నుంచి కోలుకున్నాక తిరిగి తన నెక్ట్స్ మూవీస్ షూటింగ్‏లలో జాయిన్ అయ్యేందుకు రెడీ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటికే సామ్.. విజయ్ దేవరకొండతో  డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సగం షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మధ్యలోనే సామ్ మయోసైటిస్ భారిన పడడంతో షూటింగ్ కి బిగ్ బ్రేక్ చెప్పేసింది. అయితే ఇప్పుడు కాస్త కోలుకున్న సమంత.. తిరిగి ఖుషి షూటింగ్ లో పాల్గొంటుందిలే అని అంతా భావించారు. కానీ ఆమె ఈ సినిమా షూటింగ్ ని పక్కన పెట్టేసి బాలీవుడ్  సిటాడెల్ చిత్రంలో పాల్గొననున్నట్లుగా సమాచారం వినిపిస్తోంది.ఇక అమెరికన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా అయిన సిటాడెల్ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ది ఫ్యామిలీ మేన్ డైరెక్టర్స్ అయిన రాజ్ అండ్ డీకే దీనిని తెరకెక్కిస్తున్నారు. 


ఇందులో సమంత ఇంకా వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ షూటింగ్ లో సామ్ పాల్గొన్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. దీంతో విజయ్ దేవరకొమడ సినిమాని పూర్తిగా పక్కన పెట్టేసినట్లు కొద్దిరోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఈ క్రమంలోనే ఓ అభిమాని ట్విట్టర్ వేదికగా సమంతను ప్రశ్నించడం జరిగింది. మరీ ఖుషి సినిమా పరిస్థితేంటీ ? అని ఓ నెటిజన్ అడగ్గా సామ్ స్పందించింది.విజయ్ దేవరకొండ అభిమానులకు నా క్షమాపణలు. ఖుషి సినిమా షూటింగ్ ను అతి త్వరలోనే తిరిగి ప్రారంభించనున్నాం అంటూ అభిమానులకు సారి చెప్పేసింది. ఇక సామ్.. నెటిజన్ ట్వీట్ కు విజయ్ దేవరకొండ కూడా స్పందించాడు. పూర్తి ఆరోగ్యంతో.. చిరునవ్వుతో తిరిగి వచ్చే దాకా ఎదురుచూస్తుంటాం అంటూ కామెంట్ చేశాడు. మొత్తానికి ఖుషి పై అప్డేట్ రావడంతో సామ్.. విజయ్ ఫ్యాన్స్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: