వీడియోతో భయపెడుతున్న ఆదాశర్మ..!!

Divya
టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది గ్లామర్ బ్యూటీస్ ఉన్నారు. అందులో ఆదాశర్మ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. తన అందంతో కుర్రకారుల మతి పోగొడుతూ ఉంటుంది. హార్ట్ ఎటాక్ సినిమా ద్వారా మొదటిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అందులో ఘాటైన లిప్ లాక్ సన్నివేశాలతో.. అందాలతో కుర్రకారును బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించే అవకాశం అందుకుంది. తెలుగులోనే కాకుండా కన్నడ, హిందీ, తమిళ్ వంటి భాషలలో నటించింది.
సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది 2008లో బాలీవుడ్లో హర్రర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో తన నటన వల్ల ఉత్తమ నటిగా కూడా అవార్డును అందుకున్నది.. ఆ తర్వాత 2014లో హార్ట్ ఎటాక్ చిత్రంతో తెలుగుతెరకు సుపరిచితురాలు అయ్యింది. ఎన్నో చిత్రాలలో హీరోయిన్గా , సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది. ప్రస్తుతం బాలీవుడ్లో పలు సినిమాలలో నటిస్తూ బుల్లితెర పైన పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా వెరైటీ హాట్ ఫోసులను షేర్ చేస్తూ వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది.
ముఖ్యంగా తన అంద చందాలతో డ్యాన్స్ తో బాగా సందడి చేస్తూ ఉంటుంది ఆద శర్మ . విచిత్రమైన బట్టలతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఇక దయ్యాల వీడియోస్ తో బాగా భయపెట్టేస్తూ ఉంటుంది. ఎటువంటి సోషల్ మీడియా వాస్తవానికి ఆ వీడియోని చూసి తన ఫాలోవర్స్ షాక్ అవుతూ ఉంటారు.తాజాగా ఒక వీడియోలో తన బెడ్ రూమ్ నుంచి చివరి వరకు చూడండి అని చెబుతూ ఒక వీడియోని విడుదల చేసింది.  చివరిలో మంచం పైన బ్లాంకెట్ కాస్త పైకి లేవగా అందులో ఒక పర్సన్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ వీడియో చూసేవరకు కాస్త భయంకరంగా అనిపించినా ఆ వీడియో చూసిన నెటిజన్స్ చివరిలో ఆదాశర్మ భయపెట్టింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: