వాల్తేరు వీరయ్య: ఇప్పటిదాకా షేర్ ఎంత? లాభం ఎంత?

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన మూవీ 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13 వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఇక movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ లు ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శృతి హాసన్, కేథరిన్ లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కూడా ఇంపార్టెంట్ రోల్ పోషించాడు. దీంతో ఈ మూవీ పై ముందు నుంచే చాలా భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక ఈ సినిమా నుంచి విడుదల అయిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి . ఇక మొదటి రోజు ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ లాంటి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. ఇంకా అలాగే సంక్రాంతి సీజన్ ను ఈ మూవీ కంప్లీట్ గా క్యాష్ చేసుకుంది.


పండుగ అయిపోయాకా కూడా ఈ మూవీ ఇంకా కలెక్ట్ చేస్తూ అనేక రికార్డులు కొల్లగొడుతుంది.మూడో వారం కూడా ఈ మూవీ చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. ఒకసారి ఈ సినిమా రాబట్టిన 19 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే..'వాల్తేరు వీరయ్య' చిత్రానికి మొత్తం రూ.86.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే ఖచ్చితంగా రూ.87 కోట్ల షేర్ ను రాబట్టాలి. 6 రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ సినిమా ఇక 19 రోజులు పూర్తయ్యేసరికి మొత్తం రూ.126.36 కోట్ల భారీ షేర్ ను రాబట్టి… బయ్యర్స్ కు ఏకంగా రూ.39.36 కోట్ల లాభాలను అందించింది.కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా ప్రేక్షకులు సినిమాని బ్లాక్ బస్టర్ చేస్తారని ఈ సినిమా మరోసారి నిరూపించింది. చిరంజీవి నుంచి వచ్చిన గత రెండు సినిమాలు కూడా బాలీవుడ్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యి భారీ నష్టాలను చవి చూశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: