రాశి ఖన్నా పై ట్రోల్ చేస్తున్న నేటిజన్స్..!!

Divya
సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు అప్పుడప్పుడు సరికొత్తదనాన్ని పరిచయం చేయాలని చూస్తూ ఉంటారు. పైగా సోషల్ మీడియా అందుబాటులో ఉండడం వల్ల ఫాలోవర్స్ తమ అందాలతో మెప్పిస్తూ ఉంటారు హీరోయిన్స్. దీంతో ఇప్పటికే చాలామంది హీరోయిన్లు తమ కొత్త కొత్త హాట్ గ్లామర్ ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తే ఫిదా చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వెరైటీగా ఉండాలని పలు రకాలుగా ట్రై చేస్తూ ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఇలా ఎన్నో సందర్భాలలో ట్రోల్స్ గురైన వారు కూడా ఉన్నారు.

తాజాగా హీరోయిన్ రాశి ఖన్నా కూడా సరికొత్త గెటప్ తో కనిపించడంతో ఈమె పైన బాగా ట్రోల్ చేస్తున్నారు నేటిజన్స్.  ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు .ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే మంచి క్రేజీ సంపాదించుకుంది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించింది. ఖాళీగా ఉన్న సమయంలో సోషల్ మీడియాలో తరచూ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

మొదటిసారి సినీ ఇండస్ట్రీకి బాలీవుడ్ ద్వారా పరిచయమైన రాశి ఖన్నా ఆ తర్వాత తెలుగులో  అతిథి గా  తెలుగు పరిశ్రమలో కూడా అడుగు పెట్టింది. మనం సినిమాలో మొదటిసారి అతిథి పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత హీరోయిన్గా పలు చిత్రాలలో నటించింది.
ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు చాలా సన్నబడడంతో సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోయి కనిపిస్తూ ఉంటుంది. బికినీలో కూడా అప్పుడప్పుడు కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ షాక్ ఇస్తూ ఉంటుంది. గతంలో కాస్త బొద్దుగా ఉన్నందువల్ల సినిమా అవకాశాలు రాలేదని సన్నగా మారింది.రాశి ఖన్నా మాత్రం నిజానికి బొద్దుగా ఉన్నప్పుడే చాలా క్యూట్ గా కనిపిస్తూ ఉండేది.తాజాగా ఒక ఫోటో షేర్ చేయగా అందులో యూనిఫాంలో కనిపించింది ఈ ఫోటో వైరల్ గా అవ్వగా అభిమానులు ఫిమేల్ బస్సు కండక్టర్ ని చూసేలా ఉన్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: