ఒక్క చెంప దెబ్బతో కాజల్ కెరీర్ మార్చేసిన ఆ దర్శకుడు...!!

murali krishna
దర్శకుడు తేజ  తీసిన సినిమాలకి సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది అలాంటి తేజ అప్పట్లో ఏ సినిమా తీసిన కూడా సంచలనంగా మారేది అలాగే వరుసగా 3 సినిమాలు హిట్టు కొట్టి ఇండస్ట్రీ లో మంచి టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు ను పొందాడు.అయితే తన ప్రతి సినిమా షూటింగ్ లో ఎవరొకరిని కొడుతూ తిడుతూ ఉంటాడు. తేజ చేతులో దెబ్బలు తిన్న వాళ్ళు ఫ్యూచర్ లో మంచి ఆర్టిస్టులు అవుతారనే మాట కూడా ఇండస్ట్రీ లో బాగా నే వినిపిస్తుంటుంది.తేజ సుదర్శకత్వం లో కళ్యాణ్ రామ్ హీరో గా చేసిన లక్ష్మి కళ్యాణం సినిమా లో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని అయితే తీసుకున్నారు

ఈ సినిమాతోనే కాజల్ తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది..అయితే ఒక రోజు ఒక సీన్ లో కాజల్ యాక్టింగ్ సరిగ్గా చేయలేదు ఎన్నిసార్లు చెప్పిన కానీ యాక్టింగ్ సరిగ్గా చేయకపోవడంతో విసిగిపోయిన తేజ ఆమె చెంప మీద చిన్నగా ఒక దెబ్బ కొట్టాడట దాంతో ఆమె అలిగి ఆ తర్వాత నుంచి చాలా బాగా యాక్టింగ్ చేసిందని తేజ చాలా సార్లు అయితే చెప్పాడు ఇలా దెబ్బలు కొట్టి యాక్టింగ్ చేయించుకోవడం తేజకి బాగా అలవాటు.

లక్ష్మి కళ్యాణం సినిమా మాత్రం ప్లాప్ అయింది. కానీ కళ్యాణ్ రామ్ యాక్టింగ్ కానీ కాజల్ యాక్టింగ్ కానీ జనాలకి బాగా నచ్చాయి దాంతో కాజల్ కి ఏకంగా కృష్ణవంశీ తీసిన చందమామ సినిమాలో హీరోయిన్ గా అవకాశం కూడా వచ్చింది.అలా తాను పెద్ద సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ చాలాకాలం పాటు ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా మారింది..మగధీర సినిమా కాజల్ కెరియర్ ని మార్చిన సినిమా గా అయితే చెప్పుకోవచ్చు...ఈ సినిమాతోనే తను స్టార్ హీరోయిన్ గా మారింది.ఇక అక్కడి నుండి వరుసగా పెద్ద హీరోల సినిమాల్లో నటించే అవకాశం కూడా వచ్చింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా బాగా వాడుకొని కెరియర్ ముందుకు సాగించింది.ఇండస్ట్రీ లో ఉన్న టాప్ హీరోలందరితో కూడా నటించి మంచి పేరు ను సంపాదించుకుంది…

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: