మహేష్, రాజమౌళి సినిమా మొదలయ్యేది ఎప్పుడో తెలుసా..?

murali krishna
మహేష్ బాబు ఏడాది క్రితం సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.ఆ తర్వాత   త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

 ఈ కాంబో మూడో సారి రిపీట్ కాబోతుంది. ఈ సక్సెస్ ఫుల్ కాంబో కోసం ఫ్యాన్స్ అంతా కూడా బాగా ఎదురు చూస్తున్నారు.

మహేష్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న SSMB28 సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో తీస్తున్నారు.. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే మరియు శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.. అలాగే ఆగస్టు 11న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.. ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలు అవుతుందా అంటూ మహేష్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.. ఈ సినిమా ఇంకా అధికారికంగా ప్రారంభం కాకుండానే ఎన్నో రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి... తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తుంది.. మార్చిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టడానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది అని ఈ రోజు నెట్టింట బాగా వైరల్ అవుతుంది. అయితే ప్రెజెంట్ మహేష్ బాబు త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా షూట్ లో చాలా బిజీగా ఉన్నాడని . ఈ క్రమంలోనే మార్చి నుండి మహేష్ రాజమౌళి సినిమా కు డేట్స్ ఇస్తాడా లేదా అనేది అయితే చూడాలి.. ఇక రాజమౌళి ఇప్పటి వరకు rrr సినిమా తో బిజీగా ఉన్న రాజమౌళి ఇంకా నటీనటుల ను అయితే ఎంపిక చేయలేదు.. అయితే రూమర్స్ ప్రకారం ఈ సినిమా లో కథానాయికగా దీపికా పదుకొనె అయితే బాగుంటుంది అని కూడా మేకర్స్ ఫీల్ అవుతున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: