తలపతి67: టైటిల్, గ్లింప్స్ రివీల్ చేసేది అప్పుడే..?

Purushottham Vinay
తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ రీసెంట్‌గా 'వారిసు' మూవీతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న విజయ్ అభిమానులకు విజయ్ మరో సెన్సేషనల్ న్యూస్ అందింది.విజయ్ 67వ సినిమాని తమిళ బ్లాక్ బస్టర్ అండ్ యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌తో కలిసి చేయబోతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించడం జరిగింది.ఈ అనౌన్స్‌మెంట్ గురించి గతకొద్ది రోజులుగా అభిమానులు నెట్టింట తెగ వైరల్ చేస్తూ హల్‌చల్ చేస్తున్నారు.అయితే తాజాగా ఈ కాంబినేషన్ మరోసారి సెట్ కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై కొండంత భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మాస్టర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ సినిమాలో అనిరుధ్ రవి చందర్ కంపోజ్ చేసిన సాంగ్స్, ఇంకా BGM అయితే సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేసాయి.


దీంతో మరోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తుందనగానే అభిమానుల్లో అప్పుడే ఈ సినిమాపై వేరే లెవెల్లో హైప్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాటి రికార్డులు క్రియేట్ చేస్తుందో అని ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాను ఎస్ఎస్.లలిత్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తుందనే వార్తతో ప్రస్తుతం తళపతి67 అనే హాష్‌ట్యాగ్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది.నిన్నటి నుంచి విజయ్ అభిమానులు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా టైటిల్ ఇంకా గ్లింప్స్ ని ఫిబ్రవరి 3 వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం తెలుస్తుంది. విక్రమ్ తో టాప్ దర్శకుల లిస్టులో చేరిపోయిన లోకేష్ కనకరాజు ఈ సినిమాతో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: