హీరోయిన్ పూర్ణ శ్రీమంతం.. వాళ్ళు ఒక్కరు కూడా రాలేదే?

praveen
అల్లరి నరేష్ హీరోగా నటించిన సీమటపాకాయ్ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పూర్ణ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది అని చెప్పాలి. ఇక అల్లరి నరేష్  తోనే ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత రవి బాబు దర్శకత్వంలో వచ్చిన హారర్ త్రిల్లర్ మూవీ అవును సినిమాలో నటించి ఇక మంచి సక్సెస్ సాధించింది అని చెప్పాలి. కానీ ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉన్న పోటీ తట్టుకోలేకపోయింది. స్టార్ హీరోయిన్ల ఎదుగుతుంది అనుకున్నప్పటికీ అది కుదరలేదు.

 అయితే హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోవడంతో ఇక ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించడం మొదలుపెట్టింది.  అటు రాజు గారి గది సినిమాలో ఒక దయ్యం పాత్రలో నటించినా పూర్ణ మంచి గుర్తింపు సంపాదించుకుంది అని చెప్పాలి.  ఇక ఆ తర్వాత బుల్లితెరపై పలు కార్యక్రమాల్లో కూడా ప్రత్యక్షమై ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. ఇక రీసెంట్ గా దుబాయ్ కి చెందిన బిజినెస్ మాన్ ఆసిఫ్ అలీ ని పెళ్లి చేసుకుంది. పెళ్లి గురించి అఫీషియల్ ప్రకటన చేసి ఎలాంటి అప్డేట్ లేకుండానే పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ. ఇకపోతే త్వరలోనే తల్లి కాబోతున్నట్లు ఇటీవల అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.

 ఇకపోతే ఇటీవలే పూర్ణ శ్రీమంతం వేడుకలు ఎంతో గ్రాండ్గా జరిగాయి అని చెప్పాలి.  ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. పూర్ణ శ్రీమంతానికి బంధు మిత్రులందరికీ కూడా హాజరైనట్లు తెలుస్తోంది. ఇక ఇక బుల్లితెర సెలబ్రిటీలు కూడా అటు పూర్ణ శ్రీమంతానికి హాజరయ్యారు. ఇక బేబీ బంప్ తో పూర్ణ ఎంతో అట్రాక్టివ్ గా కనిపించింది అని చెప్పాలి. ఇకపోతే పూర్ణ శ్రీమంతానికి అటు ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరు హాజరు రాలేదు. బుల్లితెర సెలబ్రిటీలు తప్ప వెండితెర నటీనటులు ఎవరూ కనిపించలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పూర్ణ తన శ్రీమంతానికి టాలీవుడ్ సెలబ్రిటీలను ఎవరిని పిలవలేదు అన్నది తెలుస్తుంది. మరి పూర్ణ ఎందుకు ఇలా ఎవరిని పిలవకుండా శ్రీమంతం చేసుకుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: