ఆ ఫీల్ గుడ్ మూవీ కి సీక్వల్ రాబోతుందా...?

murali krishna
తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ సినిమాలలో  "7/g బృందావన్ కాలనీ" గురించి ఎంత చెప్పిన తక్కువే.

2004లో విడుదలైన "7/g రెయిన్ బో కాలనీ" అనే టైటిల్ తో తమిళ్ లో విడుదలై సంచలనము సృష్టించింది.ఈ సినిమా ఆ తరువాత "7/g బృందావన్ కాలనీ" గా తెలుగులో డబ్ అయ్యి విడుదలై బ్లాక్ బస్టర్ చిత్రం గా నిలిచింది. రవి కృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో సోనియా అగర్వాల్ హీరోయిన్ గా నటించి మెప్పించింది.ఒక రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ప్రేమ కథ ఇప్పటికీ కూడా ఒక అద్భుతం అని చెప్పాలి.. 

అయితే ఈ సినిమా విడుదలైన దాదాపు 19 ఏళ్ల తర్వాత చిత్ర బృందం ఈ సినిమాకి సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా సూపర్ హిట్ సినిమా "7/g బృందావన్ కాలనీ" కి త్వరలోనే ఒక సీక్వెల్ సిద్ధమవుతోందని సమాచారం అందుతుంది.అయితే దీనికి సంబంధించిన అధికార ప్రకటన రావాలి..

చంద్రమోహన్, సుధా, సుదీప మరియు రతన్, సవిత, మనోరమ అలాగే మయూరి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సినిమా మాత్రమే కాక ఈ సినిమాలోని పాటలు కూడా సంచలన విజయం సాధించాయి.. ఇలాంటి సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ అంటే ఏ విధంగా ఉండబోతోందో అని అభిమానులు వేచి చూస్తున్నారు.ఇంకొందరు క్లాసిక్ సినిమాను చెడగొట్టొద్దు అని వేడుకుంటున్నారు.మరి ఈ సినిమాను ఎలా సీక్వల్ తీస్తారో చూడాలి. అప్పట్లో మంచి ప్రేమకధా చిత్రం గా వచ్చి అందరి మనసులలో నిలిచి పోయింది. అలాంటి సినిమాకు సీక్వల్ వస్తుందంటే ఒక పక్క ఆనందంగా వున్నా మరో పక్క  ఎలా ఉంటుందో అని ఆందోళన కూడా ఉంది అభిమానులలో…

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: