లోకేష్ సినిమా ప్రపంచం నాతోనే మొదలైంది: సందీప్ కిషన్

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ తాజాగా ‘మైఖేల్’ సినిమాతో ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీకి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీ గా ఉన్నాడు సందీప్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో సందీప్ కిషన్ ఓ ఇంటర్వ్యూ లో కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మైఖేల్ సినిమా గురించి కూడా ముచ్చటించాడు. అయితే ఇంటర్వ్యూ లో భాగంగా సందీప్ కిషన్ తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.దీంతో ప్రస్తుతం సందీప్ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ తెగ హల్చల్ చేస్తున్నాయి.ఇక ఆ ఇంటర్య్వూ లో యాంకర్ అడిగిన ప్రశ్నలకు సందీప్ కిషన్ సమాధానాలు చెప్పాడు.


ఈ నేపథ్యంలో ఈమధ్య తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘విక్రమ్’ సినిమాలో మీరు కూడా చేయాల్సిందట కదా అని యాంకర్ అడిగితే.. దానికి సందీప్ సమాధానం చెప్తూ మొదట్లో లోకేష్ తనను ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ చేయాలని అడిగాడని, తాను కూడా చేస్తాను అని చెప్పానని, అయితే కొన్ని కారణాల వల్ల ఆ తర్వాత ఇద్దరం మాట్లాడుకొని ఆగిపోయామని అందుకే ఆ సినిమాలో తాను నటించలేదని సందీప్ చెప్పుకొచ్చాడు. మరి లోకేష్ ప్రపంచంలోకి (LCU) మీరెప్పుడు వస్తారని అడిగితే.. లోకేష్ ప్రపంచం మొదలైందే నా సినిమాతోనే కదా అని సందీప్ కిషన్ బదులిచ్చాడు. ఇప్పుడు లోకేష్ పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా తనకు మొదటి నుంచీ క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి తమ మధ్యలో అలాంటి మనస్పర్థలు ఏవి లేవన్నాడు. ఒకవేళ లోకేష్ తనకు ముందు నుంచీ ఫ్రెండ్ కాకపోయుంటే అలాంటివి ఉండేవేమో అని అన్నాడు.అయినా తరువాత లోకేష్ సినిమాలో ఏదైనా క్యారెక్టర్ ఉంటే తప్పకుండా చేస్తానని అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: