ఈ ఏడాది డార్లింగ్ ఫ్యాన్స్ ని పిచ్చెక్కించే సినిమాలివే?

Purushottham Vinay
పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ లిస్ట్‌లో ఇప్పుడు వరుసగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు వున్నాయి. అన్ని అనుకున్నట్టుగా జరిగుంటే ఇప్పుడు ఆ సినిమాలు రిలీజ్ అయ్యి ప్రమోషన్‌లో ఫుల్ బిజీగా ఉండేవారు. ఇక ఆది పురుష్ సినిమా టీజర్ రిలీజ్ తరువాత పరిస్థితులు తారుమారు కావటంతో ఆ సినిమా రిలీజ్‌ కూడా వాయిదా పడింది. ఈ టీజర్‌ మీద దారుణమైన ట్రోల్స్ వచ్చినా… ఇప్పటికీ మోస్ట్‌ అవెయిటెడ్‌ లిస్ట్‌లో కొనసాగుతుంది ఆదిపురుష్‌ సినిమా.ఇంకా అలాగే ప్రభాస్‌, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సలార్ సినిమా మీద కూడా ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి. కేజీఎఫ్ మూవీతో సిల్వర్ స్క్రీన్ మీద మాస్ హిస్టీరియా క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ ప్రభాస్‌ లాంటి పాన్ ఇండియా కటౌట్‌ను తెర మీద ఎలా చూపించబోతున్నారన్న క్యూరియాసిటీ ఆడియన్స్‌తో పాటు ఇండస్ట్రీ జనాల్లో కూడా కనిపిస్తోంది. ఇక విడుదలకు  చాలా టైమున్నా కూడా డార్లింగ్ లిస్ట్‌లో ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తున్న మరో క్రేజీ మూవీ ప్రాజెక్ట్‌ కే.


మహానటి ఫేం నాగ్‌ అశ్విన్ డైరెక్షన్ లో సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ 2024 వ సంవత్సరంలో రిలీజ్‌కు రెడీ అవుతున్నా.. ఇప్పటి నుంచే ఈ సినిమా ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తోంది.ఇక డార్లింగ్ లిస్ట్‌లోకి లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా.. జెట్‌ స్పీడుతో మూవీని పూర్తి చేస్తున్నాడు రొటీన్ డైరెక్టర్ మారుతి. రీసెంట్‌గా పట్టాలెక్కిన ఈ మూవీ ఆల్రెడీ సెకండ్ షెడ్యూల్‌ వర్క్‌ కూడా జరుపుకుంటోంది. హారర్‌ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని వీలైనంత త్వరగా ఫినిష్ చేసి నెక్ట్స్ ఇయర్‌లోనే రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉంది మూవీ టీమ్‌. ప్రభాస్‌ లాంటి టాప్ హీరోను మారుతి ఎలా చూపిస్తాడో అని ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఈ సినిమా మీద ఫ్యాన్స్ కి అంత నమ్మకాలు లేవు. ఎందుకంటే మారుతి ఒక రొట్ట రొటీన్ డైరెక్టర్. అతడి కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్స్ కూడా లేవు. సో ఆ సినిమాని లైట్ తీసుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే అర్జున్‌ రెడ్డి దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగాతో ప్రభాస్ సినిమా పై ఫ్యాన్స్ కి భారీ అంచనాలు వున్నాయి. కానీ ఈ ఎప్పడు పట్టాలెక్కుతుంది, ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది అన్న విషయాల్లో ఇంకా క్లారిటీ లేకపోయినా… ఈ సినిమా కూడా ప్రభాస్‌ మోస్ట్ అవెయిటెడ్ లిస్ట్‌లో ఫ్యాన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: