SSMB28: బాబు బ్యాండ్ కడితే బాక్స్ ఆఫీస్ బద్దలే ?

Purushottham Vinay
టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంకా త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ ని మాస్ అవతారంలో చూపించబోతున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. రీసెంట్ గానే రెగ్యులర్ షూటింగ్  మొదలైంది. ఇక సెట్స్ నుంచి మహేశ్ బాబు-త్రివిక్రమ్- ప్రొడ్యూసర్ నాగ వంశీ ఉన్న ఫోటో ఒకటి లీక్ అయ్యి సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతోంది.ఈ ఫొటోలో మహేశ్ బాబు తలకి కర్చీఫ్ కట్టుకోని కనిపించాడు. మహేశ్ మాస్ లుక్ లో ఉన్నాడు అంటూ సూపర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో లీక్ అయిన ఫోటోని తెగ ట్రెండ్ చేస్తున్నారు. #SSMB28 అనే ట్యాగ్ ని క్రియేట్ చేసి మహేశ్ ఫాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీలా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా గుంటూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందనే సమాచారం ఇండస్ట్రీలో వినిపిస్తోంది.ఇక ఇదిలా ఉంటే మహేశ్ బాబు హెడ్ బ్యాండ్ కట్టిన ప్రతిసారీ బాక్సాఫీస్ కి చుక్కలు చూపిస్తూ ఉంటాడు.


రీజనల్ సినిమాలతో కూడా పాన్ ఇండియా రేంజ్ కలెక్షన్స్ కొళ్లగొట్టి కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తాడు మహేశ్ బాబు. ఆయన మొదటిసారి ‘పోకిరి’ మూవీలో హెడ్ బ్యాండ్ కట్టాడు. ఈ మూవీ అప్పటి దాకా టాలీవుడ్ లో ఉన్న ప్రతి బాక్సాఫీస్ రికార్డుని బ్రేక్ చేసింది. ఆ తర్వాత క్లాస్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేసిన శ్రీమంతుడు సినిమాలో కూడా మహేశ్ హెడ్ కి బ్యాండ్ కట్టాడు. ఈ సినిమా ఏకంగా నాన్-బాహుబలి రికార్డులని క్రియేట్ చేసింది. ఈ సెంటిమెంట్ ని బేస్ చేసుకోని #SSMB28 మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని సూపర్ స్టార్ అభిమానులు చెప్తున్నారు.  ఈసారి మాత్రం ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజులో హిట్ కొట్టడం గ్యారెంటి అనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో ఉంది. మరి ఆ నమ్మకాన్ని త్రివిక్రమ్, మహేశ్ బాబు నిజం చేస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: