ట్రెడిషనల్ లుక్ లో అదరగొడుతున్న ఐశ్వర్య రాజేష్..!!

Divya
వెండితెరపై తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఉంటుంది డస్కీ బ్యూటీ గా పేరుపొందింది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్.. సింప్లి సిటీ కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. మొదట చైల్డ్ యాక్టర్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. మొదట రాజేంద్రప్రసాద్ తో కలిసి రాంబంటు సినిమాలో బాల నటిగా నటించింది. ఆ తర్వాత హీరోయిన్ గా కౌసల్య కృష్ణమూర్తి సినిమాలో నటించి మెప్పించింది.. కానీ అప్పటికే తమిళంలో పలు సినిమాలలో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. తెలుగు లో విజయ్ దేవరకొండ తో వరల్డ్ ఫేమస్ లవర్ ,నానితో టక్ జగదీష్ సినిమా, సాయి ధరంతేజ్ తో రిపబ్లిక్ వంటి చిత్రాలలో నటించింది.

ప్రస్తుతం తమిళ్, మలయాళం వంటి భాషలలో దాదాపుగా 8 సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది .మరొక వైపు సోషల్ మీడియాలో కూడా ఐశ్వర్య తన అందచందాలతో ఆకట్టుకుంటూ ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ వరుస ఫోటో షూట్లతో కుర్రకారులను సైతం ఉక్కిరి బిక్కిరి చేసేలా కనిపిస్తోంది. ట్రెడిషనల్ లుక్ లో మైమరిపిస్తూ నేటిజెన్లను తన వైపు ఆకర్షించే అందంతో ఆకట్టుకుంటోంది .తాజాగా గ్రీన్ చుడీదారులో మెరిసిన ఐశ్వర్య రాజేష్ సాంప్రదాయమైన దుస్తులను ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఐశ్వర్య కు మద్దతుగా నిలుస్తూ లైక్స్ కామెంట్స్ చేస్తూ ఈ ఫోటోలను వైరల్ గా చేస్తున్నారు.

ఇక రీసెంట్ గా నటించిన డ్రైవర్ జమున చిత్రం కూడా ఆహా ఓటీటి లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈమెకు మాత్రం సరైన సక్సెస్ ఏ సినిమా కూడా అందుకోలేదని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా ఈమె క్రేజ్ మాత్రం పెరుగుతూనే ఉంది. ఎన్నో చిత్రాలలో కూడా డి గ్లామరస్ పాత్రల్లో నటించింది ఐశ్వర్య రాజేష్. మరి తెలుగులోనైనా ఈసారి రాబోయే సినిమాలతో సక్సెస్ అవుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: