అజిత్ 62వ మూవీ డైరెక్టర్ విగ్నేష్ శివన్ కాదా..?

Divya
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గురించి ఆయన ఫాలోయింగ్ గురించి తెలుగు , తమిళ్ సినీ ప్రేక్షకులకే కాదు యావత్ దేశ సినీ పరిశ్రమకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తను నటనతో నాచురల్ లుక్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న అజిత్ అంటే ప్రతి ఒక్కరికి వీరాభిమానం.  ముఖ్యంగా ఈయన సినిమాల కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటారనటంలో సందేహం లేదు. ఇదిలా ఉండగా తాజాగా సంక్రాంతి బరిలో తునివు పేరిట పోటీకి దిగిన అజిత్.. విజయ్ వారిసు సినిమా కలెక్షన్లను కూడా బ్రేక్ చేస్తూ సంక్రాంతి విజేతగా నిలిచారు అజిత్.
ఈ సినిమాను తెలుగులో తెగింపు పేరిట రిలీజ్ చేయగా ఇక్కడ కూడా భారీ కలెక్షన్స్ వసూలు చేసింది ఈ సినిమా. మొదట్లో సర్కారు వారి పాట సినిమాను  గుర్తుకు తెస్తోంది అనే కామెంట్లు వినిపించినప్పటికీ కూడా ఈ సినిమా కలెక్షన్ల పరంగా మరో సునామీ సృష్టించింది అని చెప్పవచ్చు.. ఇదిలా  ఉండగా తన తదుపరిచిత్రాన్ని ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్.. లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త డైరెక్టర్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.. అందుకు సంబంధించిన తారాగణాన్ని కూడా సెలెక్ట్ చేస్తున్నారు అంటూ వార్తలు వినిపించాయి.
కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అజిత్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను  కాదని డైరెక్టర్ మగిజ్ తిరుమేని కి తన 62వ చిత్ర భాద్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.  అసలు విషయం ఏమిటంటే స్క్రిప్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులను కంప్లీట్ చేయడానికి డైరెక్టర్ విగ్నేష్ శివన్ ఆరు నెలల సమయం అడిగారట. అయితే అందుకు సంతృప్తి చెందని అజిత్.. డైరెక్టర్ ని మార్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  అయితే ఇందులో ఎంత నిజం ఉంది అనేది ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అజిత్ 62వ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: