వారిసు: స్వల్ప లాభాలతో సేఫ్ హిట్?

Purushottham Vinay
తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా వారిసు.ఈ సినిమా తెలుగులో వారసుడు పేరుతో డబ్ అయ్యింది.ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకుడు. ఇంకా దిల్ రాజు నిర్మాత. ఇంకా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఎన్నో భారీ అంచనాల నడుమ ఈ సినిమా జనవరి 14 వ తేదీన విడుదలై తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు అనిపించే వసూళ్లే రాబడుతోంది. ఎట్టకేలకు వారిసు సినిమా తమిళంలో బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుంది. కానీ తెలుగులో మాత్రం ఇంకా కొంచెం దూరంలో నిలిచిపోయింది. ఇక వారిసు సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా తెలుగులో మొదటి రోజు 3.10 కోట్ల రేంజ్‌లో వసూలు చేసింది. ఈ సినిమాకి ఇప్పటి దాకా తెలుగులో రెండు రాష్ట్రాల్లో 14.67 కోట్ల షేర్ రాగా.. (రూ. 26.50కోట్ల గ్రాస్ ) వసూళ్లు వచ్చాయి.ఇక ఈ సినిమా తెలుగులో మొత్తం రూ. 15 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో సంక్రాంతి బరిలోకి దిగింది.


ఈ మూవీ సేఫ్ అవ్వాలంటే ఇంకా రూ. 33 లక్షల షేర్‌ను వసూలు చెయ్యాలి.రేపో ఎల్లుండో తెలుగులో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకునే అవకాశం ఉంది.ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్స్ విషయానికొస్తే.. తమిళనాడులో రూ. 125.60 కోట్లు గ్రాస్.. తెలుగు రాష్ట్రాలలో 27 కోట్లు.. కర్నాటకలో 14.30 కోట్లు గ్రాస్ ఇంకా కేరళలో రూ. 11.85 కోట్లు అలాగే రెస్టాఫ్ ఇండియాలో రూ. 14.00 కోట్ల గ్రాస్.. ఇంకా ఓవర్సీస్ లో రూ. 83.25 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మొత్తం రూ. 276 కోట్ల గ్రాస్.. (రూ. 140.80 కోట్ల షేర్ ) సాధించింది.ఇక ఈ సినిమా మొత్తంగా రూ. 137.90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని రూ. 139 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగింది.మొత్తం రూ. 1.8 కోట్ల లాభంతో  19 రోజుల తర్వాత బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని పూర్తి చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: