పఠాన్ @ 500 కోట్లు...?

Purushottham Vinay
కింగ్ ఖాన్ షారుఖ్‌ ఖాన్‌ ఇటీవలే సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించిన స్పై యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ పఠాన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి రికార్డు స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వరల్డ్‌ వైడ్‌గా రూ.200 కోట్ల గ్రాస్‌ మార్క్ ని దాటి టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.4 సంవత్సరాల లాంగ్ గ్యాప్‌ తర్వాత గ్రాండ్‌ రీఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్నాడు బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌. ఈ స్టార్ హీరో బాలీవుడ్ యాక్షన్ కింగ్  సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించిన స్పై యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ పఠాన్‌ సినిమాతో చాలా గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ కి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చాడు. పఠాన్‌ సినిమా హిందీ, తమిళం ఇంకా తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా జనవరి 25 వ తేదీన విడుదలైంది.

ఇప్పటికే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వరల్డ్‌ వైడ్‌గా రూ.200 కోట్ల గ్రాస్‌ ఈజీగా దాటి మూడో రోజుకి 300 కోట్లు వసూళ్లు రాబట్టినట్లుగా సమాచారం తెలుస్తుంది. ఇపుడు పఠాన్‌ సినిమాతో షారుక్ మార్క్‌ కలెక్షన్లపై ఇండస్ట్రీలో జోరుగా చర్చ నడుస్తోంది. సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే షారుఖ్‌ ఖాన్‌ క్రేజ్‌తో పఠాన్‌ ఫస్ట్ ఈ వీకెండ్‌లో ఖచ్చితంగా రూ.400 కోట్ల గ్రాస్‌ దాటేస్తుందని సమాచారం తెలుస్తుంది. పఠాన్‌ ఫస్ట్‌ వీకెండ్‌ పూర్తయ్యే సరికి సెకండ్ వీకెండ్ లోకి అడుగుపెట్టగానే ఖచ్చితంగా 500 కోట్ల క్లబ్‌లోకి కూడా ప్రవేశించి సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయమని బాలీవుడ్ ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.కేవలం నాలుగు రోజుల్లోపే రూ.300 కోట్ల మార్క్‌కు సులభంగా చేరుకున్న పఠాన్‌కు 500 కోట్ల టార్గెట్‌ ని చేరుకోవడం కూడా పెద్ద విషయమేమి కాదని అభిప్రాయపడుతున్నారు బాలీవుడ్ సినీ జనాలు.మరి చూడాలి మన తెలుగు సినిమాలు బాలీవుడ్ లో నెలకొల్పిన రికార్డులను ఈ సినిమా బద్ధలు కొడుతుందో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: