వామ్మో.. వెంకటేష్ ఇన్ని హిట్ సినిమాలను వదులుకున్నాడా?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేసి హిట్టు కొట్టడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే కొన్ని కొన్ని సార్లు ఇలా హీరోలు వదిలేసుకున్న సినిమాలు మరో హీరో చేసి సూపర్ హిట్ కొడితే ఇక  అదే కథను వదిలేసుకున్న హీరోలు బాధపడటం కూడా జరుగుతూ ఉంటుంది. కాగా ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న వెంకటేష్ విషయంలో కూడా ఇలాంటిదే జరిగిందట. వెంకటేష్ వదులుకున్న నాలుగు సినిమాలు సూపర్ హిట్ సాధించాయట. ఆ వివరాలు చూసుకుంటే..
 ఘర్షణ : ప్రభు, కార్తీక లతో మణిరత్నం ఘర్షణ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. అయితే తెలుగులో అప్పుడప్పుడే స్టార్ హీరోలుగా ఎదుగుతున్న వెంకటేష్ నాగార్జునతో ఈ సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ వాళ్ళు నో చెప్పేసరికి. చివరికి ఈ హీరోల చేతుల్లోంచి ఆ సినిమా చేజారిపోయింది. అయితే వెంకటేష్ అదే టైటిల్ తో ఓ సినిమా చేసి హిట్టు కొట్టాడు అని చెప్పాలి.
 రోజా : సూపర్ హిట్ లవ్ స్టోరీ గా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన  రోజా సినిమాను కూడా వెంకటేష్ కి వినిపించాడట మణిరత్నం. ఇక అప్పుడు చాలా సినిమాలతో బిజీగా ఉన్నందున డేట్స్ కేటాయించ లేకపోయాడు. దీంతో అరవిందస్వామి చేసి హిట్టు కొట్టాడు.
 ఒకే ఒక్కడు : శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఒకే ఒక్కడు సినిమా స్టోరీ కూడా ముందుగా వెంకీ దగ్గరికే వచ్చిందట. కానీ అప్పటికే కలిసుందాం రా సినిమాతో బిజీగా ఉండడంతో ఇక ఈ సినిమాకు ఓకే చెప్పలేకపోయాడట. దీంతో అర్జున్ తో సినిమా తీసిన శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.
 సంతోషం : నాగార్జున కెరియర్ లో సూపర్ హిట్ మూవీ గా ఉన్న సంతోషం సినిమా కథ కూడా ముందుగా వెంకీ దగ్గరికి వచ్చిందట. కానీ వెంకటేష్ అప్పటికే  అలాంటి స్టోరీలు చేయడంతో నో చెప్పాడట. కానీ నాగార్జున ఆ సినిమా చేసి హిట్టు కొట్టాడు.
 ఇవి మాత్రమే కాకుండా గోవిందుడు అందరివాడేలే, క్రాక్ సినిమాలను కూడా వదులుకున్నాడట వెంకటేష్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: