గజిని హీరోయిన్ ఆసిన్.. ఇప్పుడు ఏం చేస్తుందంటే?

praveen
సినిమా అనే రంగుల ప్రపంచంలోకి ఎప్పుడూ ఎంతోమంది నటీనటులు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అయితే ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ ఇక అదృష్టం కూడా కలిసి రావాలి. అలాంటి అదృష్టమే లేక కొంతమంది కొన్ని సినిమాలకే పరిమితమై చివరికి కనుమరుగైపోతూ ఉంటారు. మరి కొంతమంది ఇక సూపర్ హిట్ లు అందుకున్నప్పటికీ ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉన్న పోటీని తట్టుకోలేక చిత్ర పరిశ్రమకు దూరం కావడం కూడా జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇలా చిత్ర పరిశ్రమకు దూరమైన హీరోయిన్లలో అందాల ముద్దుగుమ్మ అసిన్ కూడా ఒకరు. గజినీ సినిమాలో తన అందం అభినయంతో ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 తన కొంటె చూపులతో కుర్ర కారు మతి పోగొట్టింది ఈ ముద్దుగుమ్మ. అయితే గజిని సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత కూడా వరుసగా అవకాశాలు అందుకుంది. ఇక వెంకటేష్ హీరోగా నటించిన ఘర్షణ సినిమాలో కూడా తన కోర చూపులతో కుర్ర కారు మతి పోగొట్టింది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.. సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. అయితే  మొదట రవితేజ నటించిన అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో అమాయకమైన పాత్రలో నటించింది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది అని చెప్పాలి.

 ఇక బాలీవుడ్లో అక్షయ్ కుమార్ సరసన ఆల్ ఈజ్ వెల్ అనే సినిమాలో నటించే సమయంలో రాహుల్ శర్మ అని వ్యక్తితో ప్రేమలో పడింది. ఇక పెళ్లయ్యాక సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పింది. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది అసిన్. భర్త రాహుల్ శర్మ మైక్రోమ్యాక్స్ అధినేత కావడం గమనార్హం. ఇక వీరి పెళ్ళి 2016లో న్యూఢిల్లీలోని చర్చిలో జరిగింది. ఇక ఆసీన్ కు ఆరిన్ అనే పాప కూడా ఉంది. అయితే సినిమాలకు గుడ్ బై చెప్పిన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాకు కూడా దూరంగానే ఉంటుంది అసిన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: