అజిత్ ఫ్యాన్స్ కి శుభవార్త.. #AK 63 మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్..!

Divya
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ వరుస సినిమాలు ప్రకటిస్తూ దూసుకుపోతున్నారు. సంక్రాంతి బరిలో తునివు సినిమా ద్వారా పోటీపడి భారీ కలెక్షన్స్ వసూలు చేసిన ఈయన ఇప్పుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం #AK 62 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ భాగం కానున్నట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలే కాలేదు అప్పుడే అజిత్ #AK 63వ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.
తాజాగా సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం.. అజిత్ 63వ చిత్రానికి కూడా లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారట. ఇక డైరెక్టర్ అట్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారని సమాచారం. అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా వెలువడ లేదు. కానీ త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలుస్తాయి అంటూ కూడా కోలీవుడ్ కథనాల ద్వారా వార్తలు వెలువడుతున్నాయి. ఏదిఏమైనా అజిత్ ఇలా వరుస సినిమాలు అనౌన్స్మెంట్ చేస్తూ అభిమానులకు పండగ వాతావరణాన్ని సృష్టిస్తున్నారని చెప్పవచ్చు.
అజిత్ విషయానికి వస్తే తాను తెరకెక్కించే ప్రతి సినిమాలో కూడా ఒక భిన్నమైన కథను ఉండేలాగా ప్లాన్ చేస్తూ ఉంటారు.  ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు విమర్శల పాలైనప్పటికీ కూడా ఆ కథలే ఆయనకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తూ ఉంటాయి. ఇటీవల అజిత్ నటించిన తునివు చిత్రాన్ని తెలుగులో తెగింపు పేరిట దిల్ రాజు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఊహించని విధంగా కొన్ని కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి రికార్డు సృష్టించింది. దీంతో అజిత్ 62వ చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: