పెళ్ళితో నైనా శర్వానంద్ కు కలిసొచ్చేనా..?

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు నటుడు శర్వా నంద్ ఇక ఆ తర్వాత 2017 వ సంవత్సరంలో వచ్చిన శతమానం భవతి చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకున్నారు నటుడు శర్వానంద్. ఇక ఆ తర్వాత ఏడాదికి రెండు చొప్పున సినిమాలు చేస్తే తన కెరీర్ ని ముందుకి తీసుకువెళ్లారు. కానీ అంతటి విజయాలను అందుకోలేకపోయారు. శర్వా నంద్ గత ఏడాది మాత్రం ఒకే ఒక జీవితం సినిమా ద్వారా ప్రేక్షకులను బాగా అలరించారు. అంతకుముందు జాను సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న శర్వానంద్ అంతటి కలెక్షన్లను మాత్రం అందుకోలేకపోయారు.

అందుకే శర్వానంద్ కెరీర్ ఈ మధ్యకాలంలో కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయని అభిమానులు తెలియజేస్తున్నారు. ఇలాంటి సమయంలో వివాహం చేసుకొని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.. ఇక త్వరలోనే వివాహం కూడా జరగబోతోంది నిన్నటి రోజున శర్వానంద్, రక్షితా రెడ్డి  ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా జరిగింది ఇందుకుగాను సినీ సెలబ్రెటీల సైతం హాజరు అయ్యారు. శర్వానంద్ కు ఇకనైనా కాలం కలిసి వస్తుందా అంటూ అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ ప్రేక్షకులకు కూడా అభిమానులను సంపాదించారు శర్వానంద్.

ఈ మధ్యకాలంలో కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. శర్వా నంద్ ఇక ఒకే ఒక జీవితం సినిమా మాదిరిగానే త్వరలో మరొక సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శర్వా నంద్ వివాహమైన తర్వాత సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టబోతున్న శర్వా నంద్ కొత్త సినిమాలు చేసి వరుసగా సక్సెస్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి వివాహమైన తర్వాత ఆయన శర్వా నంద్ కు అదృష్టం కలిసొస్తుందేమో చూడాలి మరి. ఏదేమైనా బ్యాచిలర్ లైఫ్ను వీడి ఈ నటుడు వివాహం చేసుకోవడంతో అభిమానులు ఆనందాన్ని తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: