"దసరా" మూవీ ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి నచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాని పోయిన సంవత్సరం అంటే సుందరానికి మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . ఈ మూవీ మంచి అంచనాలను మా థియేటర్ లలో విడుదల అయినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో కాస్త వెనుక బడింది.

దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ మూవీ గా మిగిలిపోయింది. ఇలా అంటే సుందరానికి మూవీ తో ప్రేక్షకులను కాస్త నిరుత్సాహపరిచిన నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న దసరా అనే పక్కా మాస్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సంతోష్ నారాయణ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను మరియు ఒక పాటను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.
 

ఈ మూవీ ని దర్శకుడు సింగరేణి బొగ్గు కన్నుల కార్మికుల నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టీజర్ ను ఈ నెల 30 వ తేదీన విడుదల చేయనున్నట్లు ... అలాగే సినిమాను మార్చి 30 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క ఓవర్సీస్ హక్కులను ఫార్స్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: