కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టిస్తున్న పఠాన్..!

Divya
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో ప్రస్తుతం పఠాన్ మూవీ కలెక్షన్స్ చూస్తే అర్థమవుతుంది.  సుదీర్ఘకాలంగా హిందీ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడుగా వెలుగొందుతున్న ఈయన సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.  ఈ క్రమంలోని ఎట్టకేలకు ఆయన నటించిన ప్రస్తుత చిత్రం పఠాన్.. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25వ తేదీన థియేటర్లలో విడుదలై కలెక్షన్ల పరంగా విధ్వంసం సృష్టిస్తోంది.  ముఖ్యంగా పఠాన్ విడుదలైన మొదటి రోజే భారీ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా రెండవ రోజు కూడా అంతకుమించి కలెక్షన్స్ వసూలు చేసిందని తెలుస్తోంది.
ఇకపోతే ఈ మూవీ హక్కులకు ఒక రేంజ్ లో డిమాండ్ పెరిగిందని చెప్పవచ్చు. ఈ సినిమాకు రూ.260 కోట్ల మీద బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. మరొకవైపు ఈ చిత్రాన్ని దాదాపుగా 8 వేలకు పైగా థియేటర్లలో చాలా గ్రాండ్ గా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆక్యుపెన్సి ప్రకారం కూడా సినిమా చాలా థియేటర్లలో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ముఖ్యంగా హై ఆక్ట్  యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో బ్యూటిఫుల్ హీరోయిన్ దీపికా పదుకొనే హై వోల్టేజ్ గ్లామర్ ఒలకబోసిందని.. బికినీ గ్లామర్ తో మరింత రచ్చ చేసిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
మంచి ఓపెనింగ్ సాధించిన ఈ సినిమా అదే కంటిన్యూ అవుతుందని కూడా సినీ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.  మరి రెండవ రోజు ఈ సినిమాకు ఎంత కలెక్షన్స్ వసూలు చేసింది అనే విషయానికి వస్తే రూ.68 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. తొలి రోజు రూ.57 కోట్లు రాగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ వచ్చినట్లు సమాచారం.  ఏది ఏమైనా రెండు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించింది ఈ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: