బాలకృష్ణ విషయంలో కఠిన నిర్ణయం తీసుకోనున్న అక్కినేని కుటుంబం..!!

murali krishna
బాలకృష్ణ ఎస్వి రంగారావు మరియు అక్కినేని ల గురించి చేసిన వ్యాఖ్యలు అంతకంతకు కాక రేపుతున్నాయి.అక్కినేని అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న తరుణంలో చిత్ర పరిశ్రమ రెండు వర్గాలుగా చీలుతుంది అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

 సోషల్ మీడియా లో భారీగా ఈ విషయం గురించి విమర్శలు చేసుకుంటున్నారు.. ఇప్పటికే అక్కినేని హీరోలు నాగ చైతన్య మరియు అఖిల్ తమ తాత గారి విషయం లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు అధికారిక నోట్ ను కూడా విడుదల చేసారు.

 అక్కినేని కుటుంబం  బాలకృష్ణ విషయం లో ఇంకా కఠినంగా  వ్యవహరించే పరిస్థితి ఉన్నదంటూ ఇండస్ట్రీలో చర్చ కూడా జరుగుతుంది. అదే కనుక జరిగితే అక్కినేని వారికి సంబంధించిన అన్నపూర్ణ స్టూడియోస్ లో కి బాలకృష్ణ ను అడుగు పెట్టనివ్వక పోవచ్చని తెలుస్తుంది.బాలకృష్ణ కు సంబంధించిన సినిమాల్లో ఎక్కువ శాతం అన్నపూర్ణ స్టూడియోస్ లోనే చిత్రీకరణ జరుపుకుంటుంది.

ప్రస్తుతం బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో చిత్రీకరణ ను ఎక్కువ భాగం అన్నపూర్ణ స్టూడియోలోనే జరుగుతుంది.అక్కినేని వారు చాలా సీరియస్ గా ఈ విషయాన్ని తీసుకుంటే బాలకృష్ణ ను అన్నపూర్ణ స్టూడియోస్ గేటు కూడా దాటనిచ్చే అవకాశాలు కూడా లేవని తెలుస్తుంది. కానీ అక్కినేని వారు అలా కచ్చితంగా చేయరు అని ఇంకొంత మంది సినీ ప్రముఖులు మరియు మీడియా వారు కూడా చెప్తున్నారు.బాలకృష్ణ ను అన్నపూర్ణ స్టూడియోస్ కు రాకుండా బ్యాన్ చేస్తే అది వారికి చాలా చెడ్డ పేరు తెస్తుంది.ఇప్పటి వరకు అన్నపూర్ణ స్టూడియోస్ కి ఉన్న మంచి పేరు ను స్వయంగా అక్కినేని వారు చెడగొట్టే సాహసం చేయరని వారి అభిప్రాయం.ఎలాంటి వివాదాలకు అస్సలు సంబంధం లేకుండా అక్కినేని వారి ఫిల్మ్ స్టూడియో అన్నపూర్ణ స్టూడియోస్ మంచి పేరు సొంతం చేసుకుంది.అద్భుతమైన సెట్స్ ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ ని ఈ వివాదంలోకి లాగడం అస్సలు మంచిది కాదనిచిత్ర పరిశ్రమ పెద్దల అభిప్రాయం

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: