ఘనంగా హీరో శర్వానంద్ నిశ్చితార్థ వేడుకలు.. ఫోటోలు వైరల్..!

Divya
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఒక్కొక్కరిగా బ్యాచిలర్ లైఫ్ ను వీడి.. వ్యక్తిగతంగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ క్రమంలోనే మోస్ట్ బ్యాచిలర్ గా గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ కూడా తాజాగా కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్నాడు. ఈ క్రమంలోనే తెలంగాణకు చెందిన రక్షిత రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నారు. శర్వానంద్ రక్షితా రెడ్డి తో నిశ్చితార్థం ఘనంగా జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిశ్చితార్థ వేడుకలకు రామ్ చరణ్ తో పాటు ఆయన సతీమణి ఉపాసన కూడా హాజరయ్యారు.

ఇదిలా ఉండగా రక్షిత రెడ్డి బ్యాగ్రౌండ్ కూడా చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె తండ్రి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి మధుసూదన్ రెడ్డి కాగా ఆమె తాతకి కూడా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరొకవైపు రక్షిత రెడ్డి కూడా అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఏది ఏమైనా శర్వానంద్ చేసుకోబోయే అమ్మాయి కూడా చాలా చక్కగా ఈడు జోడు పర్ఫెక్ట్ గా ఉంది అంటూ అభిమానుల సైతం తెగ కామెంట్లు చేస్తున్నారు .ప్రస్తుతం శర్వానంద్ రక్షిత రెడ్డి ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట బాగా వైరల్ గా మారుతున్నాయి.
శర్వానంద్ విషయానికి వస్తే గమ్యం, శతమానం భవతి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఇటీవల మహాసముద్రం సినిమాతో అలరించాడు తాజాగా ఒకే ఒక జీవితం సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే వివాహం తర్వాత తన జోరు పెంచాలి అని అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట త్వరలోనే పెళ్లి తేదీని కూడా ప్రకటించబోతుందని సమాచారం. మొత్తానికైతే కొత్త ఏడాది కొత్త జీవితంలోకి ప్రవేశపెడుతున్న ఈ జంటకు పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: