చిరంజీవికి షాక్ ఇచ్చిన తమ్మారెడ్డి ఆలోచనలు !

Seetha Sailaja
ప్రముఖ నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ప్రస్తుతం సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్నప్పటికీ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉంటూ సినిమా రంగం పై ప్రస్తుత పరిస్థితుల పై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటాడు. కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువగా ఉండే తమ్మారెడ్డి మాటలలో చాల వాస్తవికత కనిపిస్తూ ఉంటుంది.

సంక్రాంతి రేస్ కు విడుదలై ఘనవిజయం సాధించిన ‘వీరసింహా రెడ్డి’ మూవీలో చిరంజీవి నటనకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి ప్రశంసలు కూడ లభించడంతో చిరంజీవి మంచి జోష్ పై ఉన్నాడు. ‘ఆచార్య’ ఆపై వచ్చిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలు సరైన విజయం సాధించకపోవడంతో చిరంజీవి పని అయిపోయింది అంటూ నెగిటివ్ కామెంట్స్ చేసిన వారికి ‘వాల్తేర్ వీరయ్య’ ఘనవిజయం ఒక చెంప పెట్టుగా మారిందని చిరంజీవి అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

లేటెస్ట్ గా ఈమూవీని చూసిన తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్ పరోక్షంగా చిరంజీవికి కూడ జోష్ తో పాటు షాక్ అయ్యే ఆస్కారం ఉంది. మంచి కథ సరైన కథనంతో పాటు మంచి దర్శకుడు తోడై చిరంజీవి సినిమాను పాన్ ఇండియా మూవీగా తీయగలిగితే ఆ సినిమాకు చిరంజీవి స్టామినా రీత్యా 1000 కోట్లు కలక్షన్స్ వచ్చే ఆస్కారం ఉంది అంటూ భరద్వాజ చేసిన పొగడ్త మెగా అభిమానులలో మరింత జోష్ నింపుతోంది.

వాస్తవానికి చిరంజీవి ‘బాహుబలి’ ఇచ్చిన స్పూర్తితో పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో ‘సైరా’ ను తీసాడు. ఈమూవీని బాలీవుడ్ లో చాల ఎక్కువగా చిరంజీవి చరణ్ తో కలిసి ప్రమోట్ చేసినప్పటికీ ఆమూవీని బాలీవుడ్ ప్రేక్షకులు పట్టించుకోలేదు. లేటెస్ట్ గా విడుదలైన ‘వాల్తేర్ వీరయ్య’ ను హిందీలో డబ్ చేసి విడుదల చేసినా బాలీవుడ్ ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల మధ్య తమ్మారెడ్డి కామెంట్స్ ను స్పూర్తిగా తీసుకుని చిరంజీవితో పాన్ ఇండియా మూవీ తీసే సామర్థ్యం ఉన్న దర్శకుడు ఎవరో తెలియాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: