జక్కన్న పై పొగడ్తలు కురిపిస్తున్న ఆ డైరెక్టర్...!!

murali krishna
రాజమౌళి ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో చూసినా కానీ ఈ పేరు తెగ మారుమ్రోగిపోతోంది. 'ఆర్ఆర్ఆర్' తో జక్కన్న ఫేం ప్రపంచస్థాయికి బాగా చేరిపోయింది. ఈ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు మరికొన్ని అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చిన విషయం తెలిసిందే.

దీంతో ఎక్కడ చూసినా రాజమౌళి పేరే.. డైరెక్టర్, నిర్మాత ఎవ్వరైనా కూడా జక్కన్నపై పొగడ్తలు కురిపించేస్తున్నారు.అయితే ఈ విషయాన్ని కొంచెం వెరైటీగా చెప్పారు వివాదాస్పద దర్శకుడు అయిన రామ్ గోపాల్ వర్మ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు రాజమౌళిని పొగుడుతుంటే.. ఇండియన్ డైరెక్టర్స్ మాత్రం అసూయతో రగిలిపోతున్నారని.. మిమ్మల్ని చంపేందుకు కుట్ర చేస్తున్నారంటూ.. ఆర్జీవీ కామెంట్ చేసారు.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే వర్మ.. పొలిటికల్ నుంచి వరకు ఏ అంశాలు ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతున్నా.. వాటిపై తనదైన శైలిలో ఆయన స్పందిస్తారు. ఇక ఇటీవల 'ఆర్ఆర్ఆర్' కు ప్రపంచస్థాయిలో ప్రశంసలు దక్కడం.. రాజమౌళి ఖ్యాతి వరల్డ్‌వైడ్‌కు చేరడం.. జేమ్స్ కామెరాన్ వంటి దిగ్గజ దర్శకులు సైతం జక్కన్నను కలిసి మెచ్చుకోవడంతో.. ఈ అంశంపై అర్జీవీ కొద్దిగా భిన్నంగా స్పందించారు. 'రాజమౌళి.. ప్రస్తుత సిట్యువేషన్ ఎలా ఉందంటే.. మొగల్ ఏ అజామ్ తీసిన ఆసిఫ్ మరియు షోలే నిర్మించిన రమేష్ సిప్పీల నుంచి ఆదిత్య చోప్రా అలాగే కరణ్ జోహార్, భన్సాలీ వరకూ ప్రతి చిత్ర నిర్మాతనూ అధిగమించేశారని' కామెంట్ చేసారు.

అంతే కాదు మరో కామెంట్ లో 'దయచేసి మీ భద్రత పెంచకోండి అంటూ భారత్‌లోని కొందరు ఫిల్మ్ మేకర్లు.. మీపై అసూయతో బాగా రగిలిపోతున్నారు. మిమ్మల్ని చంపడానికి ఒక టీమ్‌ని కూడా వారు ఏర్పాటు చేశారు. ఇందులో నేను కూడా ఉన్నానంటూ'. తన కామెంట్ తో మరింత హీట్ పెంచారు వర్మ. తాను మత్తులో ఉండటం వల్లే.. ఈ రహస్యాన్ని బయట పెడుతున్నట్టు వర్మ పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం ఈ కామెంట్ నెట్టింట వైరల్‌గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: