ఇంటర్నేషనల్ డైరెక్టర్ పై మర్డర్ ప్లాన్ జరుగుతందంట....!!

murali krishna
పాన్ ఇండియా లెవెల్  దాటి వరల్డ్ లెవెల్ లో వినబడుతున్న మన ఇండియన్ డైరెక్టర్ పేరు యస్ యస్ రాజమౌళి ఆయన గత సంవత్సరం తీసిన సినిమా ఆర్ ఆర్ ఆర్ ఈ సినిమా ఆస్కార్ బరిలో ఉంది. ఐతే ఇపుడు ప్రెసెంట్ రాజమౌళి మీద వర్మ చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో దుమారం రేపుతున్నాయి. దాంట్లో భాగంగానే రాజమౌళికి సెక్యూరిటీ పెంచుకోవాల్సిందిగా సూచనలు ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ. ఆయనను మర్డర్ చేయడానికి కొంతమంది రెడీ అయ్యారంటూ ఆయన చేసిన  కామెంట్స్ ఇండస్ట్రీ లో దుమారం రేపుతున్నాయి.వర్మ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్డేటెడ్ గా ఉండి యాక్టివ్ రోల్ పోషిస్తూ సమాజ పరిస్థితులపై చేసే వ్యాఖ్యలు జనాల్లో హాట్ టాపిక్ గా మారిపోతుంటాయి.ఒకళ్ళతో సంబంధం లేకుండా తన మనసులో మాట భయపడకుండా చెప్పేస్తుంటాడు. దాంట్లో భాగంగానే రీసెంట్ గా రాజమౌళి విషయంలో కూడా ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.
ఐతే దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా విడుదలై గ్రాండ్ సక్సెస్ సాధించింది మువీ ఆర్ ఆర్ ఆర్.ఈ మూవీ కు అవార్డుల పంట పండుతుంది. అంతర్జాతీయ వేదికలపై కూడా ఒక ప్రభంజనం సృష్టిస్తోంది.ఐతే దానికి సంబంధించిన ఒక వీడియోను ఆయన పోస్ట్ చేసి అందరిని షాకింగ్ కు గురి చేసారు.ఒక
భారతీయ సినీ దర్శకుడు ఇలాంటి క్షణాలను మధురనుభూతులను అనుభవిస్తాడని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ ఊహించలేదని అన్నారు అర్జీవి.తర్వాత వెంటనే మరో పోస్ట్ చేసి  రాజమౌళి గారికి సెక్యూరిటీ పెంచుకోవాల్సిందిగా సూచనలు ఇచ్చారు.
ఐతే దేశంలోని కొందరు డైరెక్టర్స్ అసూయతో రగిలిపోతూ రాజమౌళిని మర్డర్ చేయించడానికి కూడా సిద్ధం అవుతున్నారని ఆయన అన్నారు.ఇందులో విశేషం ఏంటంటే అందులో తాను కూడా ఒకరని చెప్పడం. ఐతే నేను ఇదంతా తాగిన మత్తు లో చెప్తున్నా అని మళ్ళా పోస్ట్ చేసాడు.
అవిధంగా వర్మ చేసిన పోస్ట్ వల్ల అవి సోషల్ మీడియా లో దుమ్ము లేపుతున్నాయి. ఇపుడు ఇది వర్మ పై నేటిజన్లు డిస్కస్ చేసుకునే విధంగా మారిపోయాయి.
పాస్ట్ లో కూడా రాజమౌళి పై అర్జీవి అనేక సందర్భాల్లో కామెంట్స్ చేసారు ఆయనని భూతం తో పోల్చారు.ఐతే వారు జనాలని ఎలా మార్చారాంటే పెద్ద సినిమా అంటే ఆర్ ఆర్ ఆర్, కె జి యఫ్ కంటే ఎక్కువ స్థాయి లో  ఉంటేనే చూడాలని ప్రేక్షకులు భావించే రోజులు వచ్చాయని ఆర్జీవీ అన్నారు. దీనంతటిటీ కారణం రాజమౌళి మాత్రమే అన్నట్లుగా రామ్ గోపాల్ వర్మ కామెంట్ చేశారు. రాజమౌళి రెండు మూడేళ్లకు ఒక సినిమా తీస్తూ ఉంటారు. కానీ నిత్యం సినిమా ఇండస్ట్రీపై ఆ ప్రభావం పడుతూ వస్తోంది. ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీ కి ఆయన ఒక భూతం అని పోల్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: