వామ్మో.. మాస్ మహారాజా స్పీడ్ మామూలుగా లేదుగా..!
ప్రస్తుతం రవితేజ రావణాసుర సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. హైదరాబాదులోని పోలీస్ అకాడమీ లో ఈ సినిమాకు సంబంధించిన ఒక పాట కూడా షూటింగ్ జరుగుతున్నట్లు టాలీవుడ్ వర్గాల నుంచి ప్రచారం అందుతుంది.. మిగిలిన రెండు పాటల షూటింగ్ పూర్తి చేస్తే సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించి అత్తాపూర్ మాల్ లో కూడా ఒక పాట షూట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన అను ఇమ్మానుయేల్, మేఘ ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష, పూజిత పొన్నాడ వంటి ఐదు మంది హీరోయిన్లు నటిస్తున్నారు.
త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సాంగ్ షూటింగ్ పూర్తి అయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పని మొదలుపెట్టి వీలైనంత త్వరగా ఫైనల్ గా సిద్ధం చేయాలని నిర్మాతలు కూడా కోరినట్లు సమాచారం. ఈ సినిమాకు నిర్మాతలుగా అభిషేక నామాలతో పాటు రవితేజ కూడా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా రూ.300 కోట్లతో తెరకెక్కుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వైరల్ గా మారుతుంది. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి